iDreamPost
iDreamPost
యావత్ ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో పోరాడుతున్న వేళ కొంత మంది మాత్రం పనికట్టుకుని తమకు గిట్టని ప్రభుత్వాలపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు, ప్రజలను తప్పుదోవ పట్టించేలా సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలకు తెరలేపారు. దేశంలో అన్ని రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈ రకంగా ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో అసత్యాలతో ప్రచారం సాగిస్తూనే ఉన్నారు. సామాజిక మాద్యమాల్లో అసత్య ప్రచారం చెసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర డి.జీ.పి గౌతం సవాగ్ హెచ్చరించిన తప్పుడు ప్రచారాలు మానుకోలేదు.
మొదటి నుండి వై.యస్ జగన్ పై మత ముద్ర వేసే ప్రయత్నంలో ప్రత్యర్ధులు చివరికి కరోనా విపత్తు కాలాన్ని కూడా వదలలేదు. కాణీపాకం వరసిద్ది వినాయకుని ఆలయాన్ని కరోనా రోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం క్వారైంటైన్ చేసి వాడుకుంటుందని, ముఖ్యమంత్రి జగన్ హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నాడని. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారానికి తెరలేపారు. అయితే ఈ తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా పరిగణించిన ఆలయ అధికారులు పోలీసులకి ఫిర్యాదు చేశారు.
ఆలయ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాకు చెందిన ఎం విష్ణు వర్ధన్ రెడ్డి ఈ ప్రచారానికి పాల్పడినట్టు, తన ఫేస్ బుక్ వాట్సాప్ ఖాతాల ద్వారా తప్పుడు సమచారాన్ని ప్రచారం చేసినట్టు గుర్తించారు. ఈ మేరకు క్రిమినల్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు విష్ణు వర్ధన్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు చిత్తూరు డిప్యుటి ఎస్.పి ఈశ్వర్ రెడ్డి తెలియజేసారు