iDreamPost
android-app
ios-app

మహేష్ 27కి మేజర్ రిపేర్లు

  • Published Apr 29, 2020 | 5:35 AM Updated Updated Apr 29, 2020 | 5:35 AM
  • Published Apr 29, 2020 | 5:35 AMUpdated Apr 29, 2020 | 5:35 AM
మహేష్ 27కి మేజర్ రిపేర్లు

సాధారణంగా తన కొత్త సినిమాకు ఎప్పుడు కొంత గ్యాప్ తీసుకుని ఫ్యామిలీతో గడిపే సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఈసారి కరోనా వల్ల డబుల్ బోనస్ దక్కింది. ఇంట్లోనే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. లాక్ డౌన్ వల్ల షూటింగులు ఆగిపోవడంతో కొత్త ప్రాజెక్ట్ ని తనవరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. మరోవైపు పరశురామ్ మాత్రం ఇన్ డైరెక్ట్ గా మే 31న ప్రకటన లేదా ప్రారంభోత్సవం ఉంటుందన్న అర్థంలో సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేశాడు. ఏది ఎలా ఉన్నా ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న మాట వాస్తవం.

నిజానికి ముందు అనుకున్న స్టోరీలో చాలా కీలకమైన ఫారిన్ షెడ్యూల్ ఉందట. మహర్షి తరహాలో కొంత భాగం అమెరికాలో ప్లాన్ చేసేలా స్క్రిప్ట్ ఇంతకు ముందే రాసుకున్నారు. అయితే ఇప్పుడప్పుడే అంతర్జాతీయ ప్రయాణాలకు మన స్టార్లు ఇష్టపడటం లేదు. అందులోనూ కరోనా విశ్వరూపం చూపించిన యుఎస్ అంటే వద్దు బాబోయ్ అంటున్నారు. అక్కడ అనుమతులు దొరకడం కూడా కష్టం లెండి. ఈ నేపథ్యంలో బ్యాక్ డ్రాప్ ని అమెరికా నుంచి షిఫ్ట్ చేసి ఇండియాలోనే జరిగేలా కీలక మార్పులకు పరశురామ్ ఓకే చెప్పినట్టు వినికిడి. రెగ్యులర్ గా వీడియో ఛాట్ ద్వారా హీరో దర్శకుడు డిస్కషన్స్ లో పాల్గొంటున్నారట.

యాక్షన్ డ్రామాను నడిపిస్తునే మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో దర్శకుడు పరశురాం దీన్ని తీర్చిదిద్దబోతున్నట్టు తెలిసింది. హీరొయిన్ ఎవరనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. ఒక వర్గం కీర్తి సురేష్ అంటుండగా మరోవైపు నుంచి భరత్ అనే నేనుతో ఆల్రెడీ బోణీ కొట్టిన కీయరా అద్వానీ కాంబినేషన్ రిపీట్ కావొచ్చని అంటున్నారు. సంగీత దర్శకుడి విషయంలో కూడా ఇదే కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. తమన్, దేవిశ్రీప్రసాద్, గోపి సుందర్ ఈ ముగ్గురిలో ఒకరు ఉండే ఛాన్స్ లేదు. మరి మహేష్ ఎవరికి ఓటు వేస్తాడో తెలియదు. మొత్తానికి మహేష్ 27కి కరోనా వల్ల రిపేర్లు జరగడం గురించిన ప్రచారమైతే జోరుగానే కొనసాగుతోంది

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet