iDreamPost
android-app
ios-app

Mahesh Babu In Unstoppable Finale : దీనికీ మహేష్ బాబుతోనే శుభం కార్డు

  • Published Dec 22, 2021 | 11:35 AM Updated Updated Dec 22, 2021 | 11:35 AM
Mahesh Babu In Unstoppable Finale : దీనికీ మహేష్ బాబుతోనే శుభం కార్డు

సరిలేరు నీకెవ్వరు తర్వాత రెండేళ్ల గ్యాప్ రావడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ తమ సూపర్ స్టార్ ని చిన్నితెరపై చూసి ముచ్చట తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా క్రేజీ ప్రోగ్రాంస్ ఇంటర్వ్యూస్ కి ప్రిన్స్ నే బెస్ట్ ఆప్షన్ గా ఫీలవుతున్నారు సదరు కార్యక్రమాల నిర్వాహకులు. తాజాగా ఆహా యాప్ కోసం బాలకృష్ణ చేస్తున్న సెలబ్రిటీ ముఖాముఖీ అన్ స్టాపబుల్ ఫస్ట్ సీజన్ ముగింపుకి వచ్చింది. త్వరలో మహేష్ బాబుతో చేసిన ఎపిసోడ్ తో దీనికి ముగింపు పలకబోతున్నామని ఆహా అధికారికంగా ప్రకటించింది. రవితేజ గోపీచంద్ మలినేని తర్వాత ఇంకొక్క ఎపిసోడ్ టెలికాస్ట్ చేసి ఆఖరికి సర్కారు వారి పాట హీరోతో ముగింపు ఇవొచ్చు

ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ క్విజ్ షో ఎవరు మీలో కోటీశ్వరులుకు సైతం మహేషే ముఖ్య అతిథిగా విచ్చేసి 25 లక్షలు గెలుచుకుని దానికి ఫినిషింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తారక్ బాబాయ్ బాలకృష్ణకూ తనే లాస్ట్ గెస్ట్ కావడం విశేషం. ఇప్పటిదాకా వచ్చిన అన్ స్టాపబుల్ అన్నింటిలోకి ఇదే హై లైట్ అవ్వొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా ఫుల్ ఎనర్జీతో కామెడీ టైమింగ్ తో బాలయ్య దీన్ని నడిపిస్తున్న తీరు ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకుంది. ఆహాకు చందాదారులు కూడా పెరిగారని రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే సీజన్ 2కి కావాల్సిన హైప్ ని క్రేజ్ ని బాలకృష్ణ ఫుల్ గా ఇచ్చేసినట్టే అని ఫిక్స్ అవ్వొచ్చు

థియేటర్ కు ఆల్టర్నేటివ్ గా మారుతున్న ఓటిటిలో కంటెంట్ కోసం సంస్థలు కొత్త ఎత్తుగడలతో ముందుకు వస్తున్నాయి. గతంలో వచ్చిన టాక్ షోలు ఏమంత స్పందన దక్కించుకోలేకపోయాయి. అందుకే అన్ స్టాపబుల్ అనౌన్స్ మెంట్ వచ్చినప్పుడు రకరకాల సందేహాలు. కానీ బాలయ్య వాటిని పూర్తిగా పటాపంచలు చేసేశాడు. చిరంజీవి నాగార్జున తరహాలో తనకూ హోస్టింగ్ స్కిల్స్ ఉన్నాయని రుజువు చేశారు. ఇది ఇచ్చిన ప్రోత్సాహంతోనే సీజన్ 2 కోసం ఇంకా ఎగ్జైటింగ్ సెలబ్రిటీలను తెచ్చే ప్లాన్ లో ఉంది ఆహా. బాలకృష్ణ ఇదయ్యింది కాబట్టి వచ్చే నెల నుంచి గోపీచంద్ మలినేనితో మైత్రి సంస్థ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటారు

Also Read : Ajay Bhupathi & Kartikeya : బ్లాక్ బస్టర్ కాంబోకి పెద్ద సవాల్