iDreamPost
iDreamPost
మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ సినిమా మే 12న భారీగా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సినిమా నుండి పాటలు, ట్రైలర్ రిలీజ్ అయి సినిమాపై అంచనాలు పెంచేసాయి. మే 7న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అందరూ మాట్లాడిన దాని బట్టి సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అయిపోయింది.
‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..
నైజాం – 36 కోట్లు
సీడెడ్ – 13.5 కోట్లు
ఉత్తరాంధ్ర – 13 కోట్లు
ఈస్ట్ – 8.5 కోట్లు
వెస్ట్ – 7 కోట్లు
గుంటూరు – 9 కోట్లు
కృష్ణా – 7.5 కోట్లు
నెల్లూరు – 4 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 23.5 కోట్లు
ఓవర్సీస్ – 11 కోట్లు
మొత్తంగా సర్కారు వారి పాట సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 125కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. గతంలో వచ్చిన మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా 100 కోట్ల బిజినెస్ జరిగింది. సర్కారు వారి పాట 125 కోట్లు చేయడంతో సినిమా హిట్ కొట్టాలంటే దాదాపు 130 కోట్లకు పైగా కలెక్ట్ చేయాలి. ఇటీవల స్టార్ హీరోలంతా బాక్సాఫీస్ ని తమ కలెక్షన్లతో షేక్ చేస్తున్నారు. మరి రెండు సంవత్సరాల తర్వాత వస్తున్న మహేష్ ఎన్ని రికార్డులని బద్దలు కొడతాడో చూడాలి.