iDreamPost
android-app
ios-app

రికార్డుల వేట మొదలుపెట్టేసిన బాబు.. అమెరికాలో సర్కారువారి పాట కొత్త రికార్డు..

  • Published May 12, 2022 | 7:53 PM Updated Updated May 12, 2022 | 7:53 PM
  • Published May 12, 2022 | 7:53 PMUpdated May 12, 2022 | 7:53 PM
రికార్డుల వేట మొదలుపెట్టేసిన బాబు.. అమెరికాలో సర్కారువారి పాట కొత్త రికార్డు..

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇవాళ (మే 12న) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. మొదటి ఆట నుంచే సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డులు సృష్టించిన సర్కారు వారి పాట సినిమా తాజాగా మరో కొత్త రికార్డు సృష్టించింది.

మన తెలుగు సినిమాలకి దేశం వెలుపల అమెరికా మంచి మార్కెట్. అక్కడ మన ప్రతి సినిమా రిలీజ్ అయి మంచి వసూళ్లు సాధిస్తుంది. మహేష్ నటించిన సర్కారువారి పాట అమెరికాలో ప్రీమియర్ షోల నుంచే ఏకంగా 9 లక్షల 25వేల డాలర్లు సాధించింది. అంటే దాదాపు 6 కోట్ల 50 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇండియన్ సినిమాల్లో కరోనా తర్వాత ప్రీమియర్స్ ద్వారా అత్యథిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా సర్కారువారి పాట రికార్డ్ సృష్టించింది.

ప్రస్తుతం అమెరికా ప్రీమియర్స్ వసూళ్ల రికార్డు ఆర్ఆర్ఆర్ సినిమా పేరు మీద ఉంది. ఈ సినిమా పలు భాషల్లో విడుదల అయింది, అంతే కాకుండా సర్కారు వారి పాట కంటే కూడా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అవ్వడంతో భారీగా కలెక్షన్స్ రాబట్టింది. సర్కారువారి పాట సినిమా కేవలం తెలుగు భాషతో 477 లొకేషన్లలో రిలీజ్ అయి ప్రీమియర్స్ ద్వారానే 9 లక్షల 25వేల డాలర్లు కలెక్ట్ చేసింది అంటే చాలా పెద్ద రికార్డ్ ఇది. మరికొన్ని లొకేషన్ల నుంచి డేటా ఇంకా రావాలంట, అవి కూడా వస్తే ఈ అమౌంట్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో మరోసారి మహేష్ ఓవర్సీస్ లో తన స్టామినా ఏంటో చూపించాడు. ఈ విషయం తెలిసి మహేష్ అభిమానులు బాబు అప్పుడే రికార్డుల వేట మొదలుపెట్టాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet