iDreamPost
android-app
ios-app

జగన్ ని అభినంధించిన మహరాష్ట్ర ముఖ్యమంత్రి…

జగన్ ని అభినంధించిన మహరాష్ట్ర ముఖ్యమంత్రి…

మహిళల రక్షణ కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేసిన “దిశ” చట్టాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. మహిళల పై జరుగుతున్న దాడులు నుండి రక్షణ కల్పించేందుకు, అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడేవారిని చట్టపరంగా 21 రోజుల లోపే కఠినంగా శిక్షించేందుకు దేశంలోనే మొదటి సారి జగన్ మొహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ “దిశ” చట్టం ఇప్పుడు యావత్ మహిళా లోకంతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రశంశలందుకుంటుంది. “దిశ” చట్టం పై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఆసక్తిని కనబరచడంతో పాటు ఈ చట్టాన్ని సమగ్రంగా అధ్యయనం చెయ్యడానికి ముందుకొస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన “దిశ” చట్టాన్ని మహారాష్ట్రలో కూడా ప్రవేశపెట్టనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్భవ్ థాక్రే ప్రకటించారు.

Read Also: ఆంధ్రప్రదేశ్ లో దిశ చట్టం అమలుకు మరో ముందడుగు

ఉధ్భవ్ థాక్రే మాట్లాడుతూ మహిళలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం చాలా బాగుందని, తాము కూడా మహిళల రక్షణ కోసం వారి పై అత్యాచారం లైంగిక దాడులకి పాల్పడే వారిని 100 రోజుల లోపే శిక్షించేందుకు ఈ తరహా చట్టాన్ని తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. దిశ చట్టం గురించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి వివరాలు కోరుతున్నామన్నారు. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేయాల్సిందిగా ఉధ్భవ్ థాక్రే మహారాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అజయ్ మెహతా కి సూచించారు. ఈ దిశా తరహా చట్టాన్ని అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో ప్రవేశపెట్టాలనే యోచనలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు.

Read Also: దిశా చట్టం అమలు నా నుండే మొదలు పెట్టండి – ఆదిరెడ్డి భవాని

తెలంగాణా లో వెటర్నరీ డాక్టర్ గా పని చేస్తున్న “దిశ” అనే అమ్మాయిని నలుగురు నిందితులు అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన సంఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నేపథ్యంలో దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తాను ఈ ఘటనపై ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ఆడపిల్ల తండ్రి గా మాట్లాడుతున్నానని తీవ్ర భావోద్వేగానికి గురవుతూ శాసన సభలో చేసిన ప్రసంగంలో రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు అత్యాచారానికి గురైన బాధితురాలు “దిశ” పేరుతో కొత్త చట్టం తీసుకొస్తున్నట్టు ప్రకటించారు.

Read Also: దిశా చట్టం విఫలమైందా?

మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటీవలే ఢిల్లీ ప్రభుత్వం కూడా దిశ చట్టాన్ని ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వివరాలు కోరిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి చట్టాన్ని తీసుకురావాలని దేశవ్యాప్తంగా మేధావులు మహిళా సంఘాల నుండి వస్తున్న విజ్ఞప్తుల మేరకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.