iDreamPost
android-app
ios-app

Akhanda : ఇలాంటి పోస్టర్ చూసి ఎన్ని రోజులయ్యిందో

  • Published Jan 20, 2022 | 5:03 AM Updated Updated Jan 20, 2022 | 5:03 AM
Akhanda : ఇలాంటి పోస్టర్ చూసి ఎన్ని రోజులయ్యిందో

ఎన్ని రోజులయ్యిందో తెలుగు సినిమాకు నిజమైన 50 రోజుల పోస్టర్ పడి. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ స్టామినా నెల రోజులకే పరిమితమవుతున్న తరుణంలో డ్రై సీజన్ డిసెంబర్ లో రిలీజై రికార్డుల ఊచకోత కోసిన అఖండ 103 కేంద్రాల్లో 50 రోజుల పండగ జరుపుకోవడం పెద్ద విశేషమే. ఇందులో అసలు షిఫ్ట్ చేయకుండా రోజూ నాలుగు ఆటలతో ఈ ఫీట్ సాధించినవి 24 దాకా ఉన్నట్టు ట్రేడ్ రిపోర్ట్. థియేటర్ మారినా మారకపోయినా సెంటర్ లో చేంజ్ ఉండదు కాబట్టి ఇది అఖండమైన విజయంగానే చెప్పుకోవాలి. ఇవాళ సాయంత్రం ఆట హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో జరిగే వేడుకకు బాలయ్య హాజరు కాబోతున్నారని సమాచారం.

డిసెంబర్ 2న విడుదలైన అఖండకు తర్వాత గట్టి పోటీ చాలా వచ్చింది. పుష్ప పార్ట్ 1, శ్యామ్ సింగ రాయ్ లతో మొదలుపెట్టి మొన్నటి బంగార్రాజు దాకా కాంపిటీషన్ ఇచ్చినవి ఎన్నో ఉన్నాయి. అయినా కూడా ఇంత నెంబర్ లో అర్ధశతదినోత్సవం చేసుకోవడం రికార్డే. కొన్ని కేంద్రాల్లో పరిమిత సంఖ్యలో థియేటర్లు ఉండటం వల్ల తీసేయాల్సి వచ్చింది కానీ లేదంటే ఈ నెంబర్ ఇంకా భారీగా ఉండేది. సుమారు 150 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసిన అఖండ 90 కోట్లకు పైగా షేర్ తో బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. గతంలో లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్లు నెలకొల్పిన రికార్డులను చాలా అలవోకగా బద్దలుకొట్టి పారేసింది. అరుదైన ఘనత అందుకుంది.

మాస్ కి నచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు హిందుత్వ ధర్మాన్ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా బోయపాటి శీను దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు కుటుంబ ప్రేక్షకులను హాలుకు వచ్చి చూసేలా చేసింది. నెల రోజుల తర్వాత కూడా హౌస్ ఫుల్ బోర్డులు కనిపించడం దీనికే సాధ్యమయ్యింది. ఈ రన్ చూసే సంక్రాంతికి ప్లాన్ చేసుకున్న ఓటిటి ప్రీమియర్ ని వాయిదా వేశారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి డిస్నీ హాట్ స్టార్ లో అఖండ స్ట్రీమింగ్ మొదలుకానుంది. సౌత్ సినిమాల వరకు ఆ ప్లాట్ ఫార్మ్ మీద అతి పెద్ద హిట్ గా ఇది నిలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. మొత్తానికి అఖండ భారీ లాభాలతో పాటు రికార్డులను జమ చేసుకున్నాడు

Also Read : Mollywood : దిగ్గజాల కాంబినేషన్లో క్రేజీ వెబ్ సిరీస్

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetjojobetMeritbet güncel girişJojobet GirişbetraHoliganbetgalabetHoliganbetJojobetHoliganbetJojobetHoliganbetJojobet GirişJojobet Giriş