iDreamPost
android-app
ios-app

అందుబాటులో పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా

అందుబాటులో పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా

దేశంలోని అన్నదాతలకు గత ఏడాది నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద కేంద్రం ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సహాయానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను తాజాగా వెల్లడించింది. ఈ పథకం కింద లబ్ధి పొందుతున్న అన్నదాతల వివరాలను కేంద్ర ప్రభుత్వం సంబంధిత వెబ్ సైట్ లో పొందుపరిచింది. రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, రెవెన్యూ గ్రామాల వారీగా లబ్ధిదారుల వివరాలను ‘ ‘పీఎంకిసాన్.జీవోవి.ఇన్’ లో పొందుపరిచింది. రైతులు తమ పేరు ఉందో లేదో వెబ్సైట్లోకి వెళ్లి సరి చేసుకోవచ్చు. 

గత ఏడాది నుంచి రైతులకు పెట్టుబడి సహాయం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఆరు వేల రూపాయలు ఇస్తున్న సంగతి తెలిసిందే. మే నెల, అక్టోబర్, జనవరి నెలలో మూడు వాయిదాల పద్ధతిలో ఆరు వేల నగదును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ నేపథ్యంలో అన్నదాతలకు అండగా ఉండేందుకు ఒక నెల ముందుగానే అంటే ఏప్రిల్ నెలలోనే రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేసింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ రైతు భరోసా పథకం కింద అందిస్తున్న పెట్టుబడి సహాయం మే 15వ తేదీన రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు కొత్త లబ్ది దారులకు సహాయం చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తోంది.