iDreamPost
android-app
ios-app

ఎల్జీ పాలిమర్స్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురు: జోక్యానికి సుప్రీం నిరాకరణ

ఎల్జీ పాలిమర్స్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురు: జోక్యానికి సుప్రీం నిరాకరణ

ఎల్జీ పాలిమర్స్‌ సంస్థకు సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురు అయింది.‌ తాము జోక్యం చేసుకోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
ప్లాంట్‌ను సీల్‌ చేయాలన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ సుప్రీంలో ఎల్జీ పాలిమర్స్‌ పిటిషన్‌ వేసింది.

ఎల్జీ పాలిమర్స్ సంస్థ వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ప్లాంట్‌ను సీల్‌ చేయడం రాజ్యాంగ విరుద్ధమని సంస్థ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గా పేర్కొన్నారు.

అయితే దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఇలా పేర్కొంది. ‘‘సీల్‌ చేయడం రాజ్యాంగ విరుద్ధమని భావించట్లేదు. ఈ సమయంలో ఇందులో జోక్యం చేసుకోవాలనుకోవట్లేదు. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాం’’ అని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.