iDreamPost
android-app
ios-app

Mahesh Babu Trivikram Movie : త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయినా

  • Published Nov 17, 2021 | 9:26 AM Updated Updated Nov 17, 2021 | 9:26 AM
Mahesh Babu Trivikram Movie : త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయినా

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి ఎంపికయ్యిందనే వార్త నిన్న గట్టిగానే చక్కర్లు కొట్టింది. యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోయినా ఇది సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది. అసలు ఫామ్ లో లేని లావణ్యను అంత పెద్ద సినిమాలో తీసుకుంటారా అనే అనుమానాలు వ్యక్తం చేసినవాళ్లు లేకపోలేదు. ఒకవేళ ఇది నిజమైనా పెద్దగా షాక్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే త్రివిక్రమ్ సెకండ్ హీరోయిన్ల క్యారెక్టర్లు కథలో ఏ మాత్రం ప్రాధాన్యం ఉంటాయో మనకు తెలియంది కాదు. ఇప్పటికిప్పుడు వాటి వల్ల కెరీర్ గ్రాఫ్ అమాంతం ఎగబాకదు. ఎలా అంటారా. చూడండి.

గత ఏడాది వచ్చిన ఇండస్ట్రీ హిట్ ‘అల వైకుంఠపురము’లో నివేతా థామస్ ని తీసుకున్నారు. పూజా హెగ్డే ముందు తను ప్రేక్షకుల కంటికి అనలేదు. రెండు డైలాగులు నాలుగు సీన్లతో పని కానిచ్చేశారు. ‘అరవింద సమేత వీర రాఘవ’లో ఈషా దెబ్బని ప్రకటించినప్పుడు అబ్బో అమ్మడి స్పీడ్ కు బ్రేకులు ఉండవనుకున్నారు. అందులోనూ పూజా హెగ్డే గ్లామర్ ముందు ఈషా పాత్ర కనీస స్థాయిలో కూడా హై లైట్ అవ్వలేదు. నితిన్ ‘అఆ’లో సమంతా అట్రాక్షన్ కాగా నటన వచ్చి అనుపమ పరమేశ్వరన్ ఉనికిని చాటుకుందే తప్ప వరసగా అవకాశాలు క్యూ కట్టలేదు. ‘అజ్ఞాతవాసి’లో అను ఇమ్మానియేల్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతేగా.

సో లావణ్య త్రిపాఠిని నిజంగా తీసుకున్నా సినిమా రిలీజయ్యాకే అది ఎంత వరకు ఉపయోగపడుతుందో చెప్పొచ్చు. ఒకప్పుడు స్టార్ హీరోలతో బాగానే జోడి కట్టిన ఈ భామను సక్సెస్ పలకరించి చాలా కాలమయ్యింది. ఈ ఏడాది రెండు సినిమాలు ఒకే నెలలో వచ్చాయి. ఏ1 ఎక్స్ ప్రెస్ అంచనాలు అందుకోవడంలో విఫలం కాగా చావు కబురు చల్లగా మరీ దారుణంగా దెబ్బసి డిజాస్టర్ అయ్యింది. పైపెచ్చు విధవ పాత్రలో లావణ్యను చూడకలేకపోయారు జనాలు. ఎందుకో మరి అందరిలాగా లావణ్య వెబ్ సిరీస్ ల రూటు తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. మరి నిజంగా త్రివిక్రముడు ఏమైనా బ్రేక్ ఇస్తారేమో చూడాలి

Also Read : Sankranthi Clash : సంక్రాంతి క్లాష్ గురించి సీరియస్ చర్చలు ?