iDreamPost
android-app
ios-app

ఖుషి కలెక్షన్స్! ఫస్ట్ డే ఎంత వసూల్ చేసిందంటే..

  • Author ajaykrishna Updated - 12:54 PM, Sat - 2 September 23
  • Author ajaykrishna Updated - 12:54 PM, Sat - 2 September 23
ఖుషి కలెక్షన్స్! ఫస్ట్ డే ఎంత వసూల్ చేసిందంటే..

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన రొమాంటిక్ లవ్ డ్రామా ఖుషి. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా.. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ వారు నిర్మించిన ఈ సినిమా.. ముందునుండి సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. మరోవైపు ట్రైలర్ లో విజయ్, సమంతల కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయినట్లు అనిపించింది. ఇక భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా.. ఫస్ట్ డే పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ అదరగొట్టింది. స్టోరీ నార్మల్ అయినా.. దర్శకుడు శివ స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ బాగుందని ఆడియన్స్ చెప్పుకుంటున్నారు.

లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత విజయ్ నుండి వచ్చిన సినిమా ఖుషి. ఈ లవ్ స్టోరీపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అలాగే ముందునుండి ఖుషిపై కాంఫిడెన్స్ గా ఉన్నాడు విజయ్. కాగా.. తాజాగా ఖుషి ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలను ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. విజయ్ కెరీర్ లో ఖుషి.. బిగ్గెస్ట్ ఓపెనర్ గా నెంబర్స్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఫస్ట్ డే ఏకంగా నైజాంలోనే దాదాపు రూ. 5 కోట్లకు పైగా షేర్ రాబట్టడం విశేషం. మరోవైపు వరల్డ్ వైడ్ రూ. 15 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసింది. మొత్తం రూ. 53.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఖుషి.. బాక్సాఫీస్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యిందో చూద్దాం. మరి ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఖుషి ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయంటే..

ఖుషి ఫస్ట్ డే కలెక్షన్స్:

  • నైజాం: 5.15 Cr
  • సీడెడ్: 91 L
  • ఉత్తరాంద్ర: 1.13Cr
  • ఈస్ట్: 66L
  • వెస్ట్: 63L(34L Hires)
  • గుంటూరు: 66L
  • కృష్ణా: 44L
  • నెల్లూరు: 29L(10L Hires)

ఏపీ, తెలంగాణ: 9.87Cr షేర్ (15.85Cr గ్రాస్)

  • కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా: 85L
  • ఇతర భాషలు కలిపి: 45L
  • ఓవర్సీస్ – 4.20Cr

వరల్డ్ వైడ్: 15.37Cr షేర్ (26.85Cr గ్రాస్)

ఈ లెక్కల ప్రకారం.. ఖుషి ఇంకా రూ. 38.13Cr వసూల్ చేయాల్సి ఉంది. మరి ఖుషి క్లీన్ హిట్ అవుతుందా లేదా మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom