Idream media
Idream media
మనుషులకు కుక్కలు, గుర్రాలు మంచి నేస్తాలు..అవి మనతో మాట్లాడలేవు గానీ మనం సరిగా శిక్షణ ఇస్తే మనం ఏమి చెప్పినా తు. చ. తప్పకుండా పాటిస్తాయి. వాటికోవలోనే డాళ్ఫిన్లు కూడా మన మాట వింటాయి..మనతో స్నేహం చేస్తాయి..చెప్పినమాటల్లా వింటాయి…సరిగ్గా వాటిలోని ఈ మంచిలక్షణాలే ఇరాన్ తనకు అనువుగా మార్చుకుంది.
గతంలో రష్యాలో శిక్షణ పొందిన కొన్ని డాళ్ఫిన్లను కొనుగోలు చేసిన ఇరాన్ వాటిని పర్షియన్ జలాల్లో యుద్ధానికి వినియోగిస్తుందని భావిస్తున్నారు. వీటి తలలకు ఈటెల్లాంటి సాధనాలను కడితే మనుషుల్నీ వేటాడతాయ్. ప్రత్యేక శిక్షణ పొందిన ఈ జీవుల్ని 2000 సంవత్సరంలో నాటి
సోవియట్ నుంచి కొన్న ఇరాన్ వాటిని ఆత్మాహుతి దళాలుగా మార్చిందని అంటున్నారు. ఇవి నీటి అడుగున సంచరిస్తూ జలాంతర్గాముల చోదక వ్యవస్థలు
నీటి అడుగున వెలువరించే శబ్దాల ఆధారంగా అవి రష్యావో, అమెరికావో కనిపెట్టగలుగుతాయి అంటున్నారు.
వాస్తవానికి వీటి శిక్షకుడి పేరు బోరిస్ జురిద్. ఇవి అప్పట్లో ఓ డాల్ఫినేరియంలో పర్యాటకులకు వినోదం అందించేవి. అలా వచ్చిన డబ్బుతో జురిద్ తన డాల్ఫిన్లను పోషించేవాడు. అనంతరం టూరిస్టులు రాక, సొమ్ము లేక, తిండి పెట్టలేక వీటిని అతడు ఇరాన్ కు అమ్మేశాడు. దాంతో ఈ ‘కిరాయి’ కిల్లర్ డాల్ఫిన్ల స్థావరం రష్యన్ పసిఫిక్ నుంచి పర్షియన్ గల్ఫ్ కు మారింది. ప్రస్తుతం అవి ఏం చేస్తున్నాయో, ఇరాన్ వాటికి అప్పగించిన పనేమిటో ఎవరికీ తెలియదు.