iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో విషాదం.. కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడి మృతి!

దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలపై దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది.

దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలపై దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది.

హైదరాబాద్ లో  విషాదం.. కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడి మృతి!

ఇటీవల కాలంలో వీధి కుక్కల దాడి ఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎవరైనా ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎక్కడైనా కుక్కలు కనిపిస్తే చాలు భయపడిపోతున్నారు. అలానే తెలంగాణ రాష్ట్రంలో తరచూ వరకు వీధి కుక్కలు స్వైర విహారం చేయడం, మనుషులపై దాడులు చేసిన ఘటనలు మనకు కనిపిస్తున్నాయి. అంతేకాక కొన్ని రోజుల క్రితం వీధి కుక్కల దాడిలో ప్రదీప్‌ నాలుగేళ్ల చిన్నారి మృతి చెందడం.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పట్లో వీధి కుక్కల సమస్యపై పెద్ద ఎత్తున చర్చ సాగింది. తాజాగా హైదరాబాద్ లో మరో ఘోర విషాదం, దారుణం వెలుగులోకి వచ్చింది. కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు.

దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలపై దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవల కుక్కల దాడిలో పలువురు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ వరుస ఘటనలు మరువక ముందే తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మియాపూర్ ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది. మియాపూర్ లో ఓ కుటుంబం భిక్షాటన చేస్తూ అక్కడే నివాసం ఉంటుంది. వారికి సాత్విక్ అనే కుమారుడు ఉన్నాడు.

జూన్ 4వ తేదీ మంగళవారం ఆడుకునేందుకు సాత్విక్ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బయటకు వెళ్లిన బాలుడు ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో బుధవారం ఉదయం మక్తాలోని నిర్మానుష్య ప్రాంతంలో సాత్విక్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

బాలుడి ఒంటి మీద కుక్కలు దాడి చేసిన కాట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో డంపింగ్ యార్డు ఉండటంతో అక్కడ కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికలు తెలిపారు. బాలుడి మృతితో వారి కుటుంబంలో విషాదం అలుముకుంది. సాత్విక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా కుక్కల దాడిలో ఎంతో మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. శునకాల స్వైర్య విహారానికి చెక్ పెట్టాలని ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.  గతంలో హైదరాబాద్ లోని అంబర్ పేట్ లో జరిగిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించి. ఆ తరువాత కూడా ఇలాంటి విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి.  మరి.. ఇలాంటి ఘటనల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.