Arjun Suravaram
రానురాను వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఒంటరిగా ఎవరైనా కనిపిస్తే చాలు.. వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడమో లేదా ప్రాణాలు తీయడమో చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
రానురాను వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఒంటరిగా ఎవరైనా కనిపిస్తే చాలు.. వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడమో లేదా ప్రాణాలు తీయడమో చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
Arjun Suravaram
ఈ మధ్యకాలంలో మనుషులపై కుక్కులు దాడులు చేస్తున్న ఘటనలు బాగా ఎక్కువయ్యాయి. ఒంటరిగా ఎవరైన కనిపిస్తే.. చాలు వారిపై దాడి చేసి.. ప్రాణాలు తీస్తున్నాయి. ఇక శునకాల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారే కాకుండా.. మరెందరో తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా ఒంటరిగా ఆడుకుంటున్న పిల్లలపై వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పిల్లలపై కుక్కలు దాడి చేయడంతో మృత్యువు ఒడిలోకి చేరుతున్నారు. తాజాగా సంగరెడ్డి జిల్లాలో ఓ ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటన పిల్లలను బయట వదిలేసి…తమ పనుల్లో నిమగ్నమైయ్యే తల్లిదండ్రులు ఓ పాఠమనే చెప్పాలి. అలా పిల్లల్ని బయట ఆడుకోవడానికి వదిలేసే తల్లిదండ్రులు ఈ స్టోరీ చూడండి. ఇక ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రాంతంలో బాలుడు ఇంటి బయట ఆడుకుంటున్నారు. అదే సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు. ఇక ఆ చిన్నారి బయట ఆడుకుంటున్న సమయంలో కుక్కులు ఒక్కసారిగా చుట్టు ముట్టాయి. ఆ బాలుడిని ఎటూపోనివ్వకుండా దాదాపు ఆరు, ఏడు కుక్కలు దాడి చేశాయి. ఇక ఒక్కసారిగా బాలుడిని కింద పడే..పీకడం ప్రారంభించాయి. ఇదే సమయంలో బాలుడు పెద్ద ఎత్తున కేకలు వేయ్యండంతో అక్కడే ఇంట్లో ఉన్న ఓ వ్యక్తి వచ్చి…. వాటిని తరిమివేయడంతో బాలుడు ప్రాణాలు నిలిచాయి. బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.
బాలుడికి రక్త స్త్రావం బాగా జరిగిందని స్థానికులు తెలిపారు. దీంతో వెంటనే ఆలస్యం చేయకుండా స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక బాలుడు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో ఓ స్టంట్ మాస్టర్ భార్యపై దాదాపు 15 కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. వాకింగ్ వెళ్లిన ఆ మహిళపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనపై బాధితురాలి భర్త కూడా సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కల నిర్మూలకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న.. ఎదో ఒక ప్రాంతంలో ఇదే తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ బాలుడి సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బయట ఆడుకుంటున్న చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి
సంగారెడ్డిలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిని చుట్టుముట్టి దాడి చేసిన వీధికుక్కలు.. గమనించిన స్థానికులు బాలుడిని రక్షించి, రక్తస్రావం అవ్వడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. pic.twitter.com/JtqD1wXhNL
— Telugu Scribe (@TeluguScribe) July 3, 2024