Arjun Suravaram
రానురాను వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఒంటరిగా ఎవరైనా కనిపిస్తే చాలు.. వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడమో లేదా ప్రాణాలు తీయడమో చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
రానురాను వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఒంటరిగా ఎవరైనా కనిపిస్తే చాలు.. వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడమో లేదా ప్రాణాలు తీయడమో చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
Arjun Suravaram
ఇటీవల కాలంలో మనుషులపై కుక్కలు చేస్తున్న దాడుల ఘటనలు బాగా పెరిగాయి. ఒంటరిగా ఎవరైనా కనిపిస్తే చాలు వారిపై దాడి చేస్తున్నాయి. ఇక శునకాల దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడుతున్నారు. గడిచిన కొద్ది రోజుల్లో పసిపిల్లలపై కుక్కలు చేసిన దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అంబర్ పేట్ లో జరిగిన ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం దృష్టించిన సంగతి తెలిసింది. ఆ తరువాత కూడా ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. అలానే తాజాగా హైదరాబాద్ లోని మణికొండ ప్రాంతంలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ స్టంట్ మాస్టర్ భార్యపై 15 కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మధ్యకాలంలో రానురాను వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఒంటరిగా ఎవరైనా కనిపిస్తే చాలు.. వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చడమో లేదా ప్రాణాలు తీయడమో చేస్తున్నాయి. పసి పిల్లల నుంచి పండు ముసలి వరి వరకు ఎవరు కనిపిస్తే వారిపై ఈ శునకాల దాడులు చేస్తున్నాయి. గతంలో హైదరాబాద్ నగరంలోని అంబర్ పేట్ ప్రాంతంలో నాలుగేళ్ల బాలుడిని అత్యంత దారుణంగా చుట్టుముట్టి కుక్కులు దాడి చేసి చంపాయి. ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా రాష్ట్ర ప్రజలందరిని దిగ్బ్రాంతికి గురి చేసింది.
ఈ ఘటనతో కుక్కల దాడులను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. అప్పటి నుంచి చాలా వరకు ఈ కుక్కల దాడుల ఘటనలు తగ్గాయి. అయినప్పటికీ తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఈ తరహా ఘటనలు పునరావృతం అవుతున్నాయి. చాలా చోట్ల పసిపిల్లలపై, వృద్ధులపై దాడులు చేస్తున్నాయి. అలానే రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్నవారిపై చుట్టుముట్టి దాడి చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని మణికొండ ప్రాంతంలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా వెళ్తున్న మహిళపై ఏకంగా 15 వీధి కుక్కలు దాడి చేశాయి. ఎలాగైతే జంతవుల్ని పీక్కుతింటాయో.. దాదాపు అదే స్థాయిలో ఈ మహిళను కింద పడేసి దాడి చేశాయి. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యింది.
చాలా సేపు ఆ మహిళను చుట్టుముట్టిన కుక్కలు దాడి చేశాయి. ఆమె వాటి నుంచి తప్పించుకునేందుకు చాలా సేపు ప్రయత్నించింది. చివరకు వేరే వాళ్లు వచ్చి..వాటిని తరమడంతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. మణికొండలోని చిత్రపురి హిల్స్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో చాలా మంది పిల్లలపై కుక్కలు దాడి చేశాయని, జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని నివాసితులు ట్విటర్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు.
ఇక కుక్కల దాడిలో గాయపడిన మహిళ..స్టంట్ మాస్టర్ భార్య. బద్రి అనే స్టంట్ మాస్టర్ చిత్రపురి హిల్స్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన భార్య శనివారం ఉదయం 6 గంటలకు వాకింగ్ చేసేందుకు బయటికి వెళ్లారు.ఈ క్రమంలోనే ఆమెపై ఒక్కసారి 15 కుక్కలు ఆమెపై దాడి చేశాయి. దాదాపు 10 నిమిషాల పాటు వాటితో పోరాడిన ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనపై స్టంట్ మాస్టర్ బద్రి స్పందిస్తూ..ఓ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీసీటీవీ ఫుటేజ్
దారుణం.. మహిళపై 15 కుక్కల దాడి
మణికొండలోని చిత్రపురి హిల్స్ వద్ద ఓ మహిళపై దాదాపు 15 కుక్కలు దాడి చేశాయి.
ఈ ప్రాంతంలో చాలా మంది పిల్లలపై కుక్కలు దాడి చేశాయని, GHMC ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని నివాసితులు ట్విటర్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. pic.twitter.com/O452O8SIpQ
— Telugu Scribe (@TeluguScribe) June 22, 2024