iDreamPost
android-app
ios-app

Hydలో మరో దారుణం.. రెండేళ్ల బాలుడిని పీక్కుతిన్న కుక్కలు!

Hyderabad Dogs Attack: హైదరాబాద్ లో మరో దారుణం చోటుచేసుకుంది. రెండేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ప్రస్తుతం కుక్క దాడిలో చనిపోయిన బాలుడి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Hyderabad Dogs Attack: హైదరాబాద్ లో మరో దారుణం చోటుచేసుకుంది. రెండేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ప్రస్తుతం కుక్క దాడిలో చనిపోయిన బాలుడి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Hydలో మరో దారుణం.. రెండేళ్ల బాలుడిని పీక్కుతిన్న కుక్కలు!

ఇటీవల కాలంలో తరచూ వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిపై కుక్కలు దాడి చేస్తున్నాయి. వీటి దెబ్బకు ఇళ్లల నుంచి బయటకు వచ్చేందుకు కూడ ప్రజలు వణికిపోతున్నారు. కుక్కల దాడి కారణంగా పలువురు చిన్నారులు మృతిచెందారు. అంతేకాక పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నారు.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరబాద్ లోని జవహర్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. రెండేళ్ల  బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. దీంతో వారి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి ప్రాంతంలో భరత్, లక్ష్మి దంపతులు ఉంటున్నారు. వీరికి నిహాన్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. నెల రోజుల క్రితం ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి..బంధువుల ఇంటికి కుమారుడితో సహా వెళ్లారు. ఈ క్రమంలో గత మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులంతా ఇంట్లో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో భరత్ కుమారుడు నిహాన్‌ ఆడుకునే క్రమంలో ఇంటి బయటకు వచ్చాడు. అతడు బయటకు వెళ్లిన విషయం కుటుంబ సభ్యులు గుర్తించలేదు.

ఇదే సమయంలో ఇంటి బయట బాలుడు ఆడుకుంటూ ఉండగా.. అక్కడే తిరుగుతున్న వీధి కుక్కలు దాడి చేశాయి. చిన్నారి నిహాన్‌ చారిపై వీధికుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఇది గమనించిన స్థానికులు కుక్కలు తరిమికొట్టారు.  అప్పటికే ఆ బాలుడి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడి పరిస్థితి విషమించడంతో.. గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలాల రోదించారు. చిన్నారి ఒంటిపై కుక్కకాట్ల దృశ్యాలు అందరి హృదయాలు ద్రవింప చేశాయి. బాలుడి తల నుంచి కాలి వరకూ పీకేశాయ్‌.

ఇక జవహర్‌నగర్‌లో వీధి కుక్కలు దాడి చేసి రెండేళ్ల బాలుడిని చంపేసిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన తనను కలిచివేసిందని సీఎం అన్నారు. భ‌విష్యత్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారులకు ఆదేశించారు. ఇటీవల కాలంలో చిన్నారులపై వీధికుక్కల దాడులు పెరిగిపోయాయి. ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్న వీటి దాడులు మాత్రం ఆగడం లేదు. కొన్ని రోజుల క్రితం ఓ స్టంట్ మాస్టార్ భార్యపై కూడా దాదాపు 15 వీధి కుక్కలు దాడి చేశాయి.