iDreamPost

Khiladi : మాస్ మహారాజా డబుల్ ట్రీట్ వస్తోంది

Khiladi : మాస్ మహారాజా డబుల్ ట్రీట్ వస్తోంది

మొత్తానికి రవితేజ కొత్త సినిమా ఖిలాడీ విడుదలలో ఎలాంటి మార్పు లేదు. ఏపిలో సగం సీట్ల ఆక్యుపెన్సీతో పాటు నైట్ కర్ఫ్యూ 14 దాకా ఉండటం వల్ల 18కి వాయిదా వేస్తారేమో అనే అంచనాలు కొనసాగుతున్న నేపథ్యంలో యూనిట్ మరోసారి క్లారిటీ ఇచ్చింది. హిందీ డబ్బింగ్ వెర్షన్ ను కూడా అదే రోజు 11న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు కొత్త పోస్టర్ తో స్పష్టత ఇచ్చారు. సో మాస్ మహారాజా నేరుగా హిందీ ప్రేక్షకులను కూడా ఒకేరోజు కలుస్తాడన్న మాట. దీనికి సంబంధించిన ప్రొడక్షన్ పనులు, డబ్బింగ్ వర్క్స్, సెన్సార్ ఫార్మాలిటీస్ అన్నీ వేగంగా పూర్తి చేస్తున్నట్టు తెలిసింది. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టులు సోషల్ మీడియాలో దీన్ని ధృవీకరించారు.

పుష్ప పార్ట్ 1కి ఉత్తరాదిన వచ్చిన రెస్పాన్స్ చూశాక ఖిలాడీ ఆ అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. పైగా 11న హిందీ సినిమాలేవీ రావడం లేదు. ఒకవేళ ఖిలాడీకి పాజిటివ్ టాక్ వస్తే ఈజీగా రెండు వారాలు బాక్సాఫీస్ దగ్గర మేజిక్ చేసేయొచ్చు. ఒకవేళ 18న వస్తే 25న రిలీజయ్యే గంగూబాయ్ కటియావాడితో చాలా రిస్క్ ఉంటుంది. థియేటర్లు తగ్గిపోతాయి. అందుకే రవితేజ టీమ్ చాలా తెలివైన ఎత్తుగడ వేసింది. ఇప్పటికే పుష్ప బాగా డౌన్ అయిపోయింది కాబట్టి ఆ స్పేస్ ని ఖిలాడీ వాడుకోవచ్చు. క్రాక్ ని అక్కడి జనం బాగా రిసీవ్ చేసుకున్నారు. డబ్బింగ్ అయినా కూడా ఎగబడి చూశారు. అందుకే ఇప్పుడిన్ని అంచనాలు

ఖిలాడీ రావడం ఇప్పుడు చాలా అవసరం. సరైన సినిమా లేక స్క్రీన్లు వెలవెలబోతున్నాయి. నిన్న విశాల్ సామాన్యుడుకి నిరాశపరిచే ఓపెనింగ్స్ వచ్చాయి. శ్రీకాంత్ కోతలరాయుడు, సునీల్ అతడు ఆమె ప్రియుడు లాంటి సినిమాలకు మినిమమ్ పబ్లిక్ లేక చాలా చోట్ల షోలు క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బంగార్రాజు కూడా స్లో అయ్యింది. ఇంకా కొన్ని సెంటర్లలో అఖండ, పుష్పలతో నెట్టుకొస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డిజె టిల్లు 12కి ఫిక్స్ అయ్యి మంచి పని చేసింది. ఖిలాడీకి ఒక రోజు గ్యాప్ ఉండటం వల్ల ఓపెనింగ్స్ పరంగా ఇబ్బందేమీ ఉండదు. సో రెండో వారం నుంచి కొత్త జోష్ రానుందన్న మాట

Also Read : Twitter : సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి