ప్రకంపనలు రేపుతున్న కెజిఎఫ్ 2 డీల్

ఒకప్పుడు ఆడియో సక్సెస్ అనేది క్యాసెట్లు, సిడిల అమ్మకాలు వాటి ద్వారా వచ్చిన రెవిన్యూ ద్వారా లెక్క వేసేవాళ్ళు. ఆ కౌంట్ ని బట్టే ప్లాటినం డిస్క్ అని గోల్డెన్ డిస్క్ అని వేడుకలు జరిగేవి. కానీ ఇప్పుడు అదంతా గతం. ప్రపంచంతో పాటు ఎంటర్ టైన్మెంట్ సైతం డిజిటల్ అయ్యాక ఈ ట్రెండ్ మారిపోయింది. యుట్యూబ్, ప్లే స్టోర్ యాప్స్ , వెబ్ సైట్స్ లో సదరు సినిమాల తాలూకు పాటలు ఎలాంటి స్పందన తెచ్చుకుంటున్నాయి వాటి మీద ఎంత ఆదాయం వస్తుందనేది కీలకంగా మారిపోయింది. వ్యూస్, విజిట్స్ పేరేదైనా సరే శ్రోతలు ఎక్కువ శాతం ఏ పాటలు వింటున్నారు అనేదాన్ని బట్టి అది ఎంత బ్లాక్ బస్టర్ అనే క్లారిటీ వస్తోంది.

నిన్న కెజిఎఫ్ 2 మ్యూజిక్ రైట్స్ ని లహరి టి సిరీస్ లు ఏకంగా 7 కోట్ల 20 లక్షలకు సొంతం చేసుకోవడం ఒకరకంగా షాక్ అనే చెప్పాలి. కేవలం ఆడియోకి ఇంత ధర పలకడం చాలా అరుదు. ఈ లెక్కన ఈ సినిమాకున్న క్రేజ్, రేపు పాటలు ఒక్కొక్కటిగా బయటికి వచ్చాక ఏ స్థాయిలో రెస్పాన్స్ ఉండబోతోందో ముందే ఈ కంపెనీలు వేసిన అంచనాను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఫిదా, అల వైకుంఠపురములో లాంటి ఆల్బమ్స్ వల్ల ఆన్ లైన్ ఆడియోకి సైతం ఇటీవలి కాలంలో డిమాండ్ పెరుగుతోంది. కొన్ని పాటలు చాలా తక్కువ వ్యవధిలో వందల మిలియన్ల రీచ్ లు సంపాదించి కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి.

ఒకరకంగా చెప్పాలంటే కెజిఎఫ్ ఆడియో అమ్మకం రాబోయే రోజుల్లో ఒక బెంచ్ మార్క్ గా నిలిచిపోతుంది. రాధే శ్యామ్ ఎంత పలికిందనే వివరం ఇంకా బయటికి రాలేదు కానీ కెజిఎఫ్ 2 తో పోలిస్తే కొంత తక్కువగానే ఉండొచ్చని ఆడియో వర్గాల రిపోర్ట్. చూస్తుంటే సినిమా సంగీతానికి మళ్ళీ మంచిరోజులు వస్తున్నట్టు కనిపిస్తోంది. దీన్ని నిలబెట్టుకోవాలి అంటే సంగీత దర్శకులు మరింత క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చేందుకు కష్టపడాలి. ఇళయరాజా. ఏ ఆర్ రెహమాన్ తరహాలో ఏడాదిలో ఎన్ని సినిమాలు చేసినా ప్రతి ఆల్బమ్ అద్భుతం అనిపించుకునేలా క్రియేటివిటీకి పదును పెట్టాలి. అప్పుడే ఈ ట్రెండ్ చిరకాలం నిలిచిపోతుంది

Show comments