iDreamPost
android-app
ios-app

YASH: అసిస్టెంట్ ఇంటికి వెళ్లి సడెన్ సర్ఫ్రైజ్ ఇచ్చిన యశ్.. ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా?

  • Published Feb 14, 2024 | 7:18 PM Updated Updated Feb 14, 2024 | 7:46 PM

తన అసిస్టెంట్ ఇంటికి సడెన్ గా వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చారు రాకింగ్ స్టార్ యశ్ దంపతులు. అంతే కాదండోయ్ ఇటీవలే పుట్టిన వారి బాబుకు ఓ భారీ గిఫ్ట్ కూడా ఇచ్చారు.

తన అసిస్టెంట్ ఇంటికి సడెన్ గా వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చారు రాకింగ్ స్టార్ యశ్ దంపతులు. అంతే కాదండోయ్ ఇటీవలే పుట్టిన వారి బాబుకు ఓ భారీ గిఫ్ట్ కూడా ఇచ్చారు.

  • Published Feb 14, 2024 | 7:18 PMUpdated Feb 14, 2024 | 7:46 PM
YASH: అసిస్టెంట్ ఇంటికి వెళ్లి సడెన్ సర్ఫ్రైజ్ ఇచ్చిన యశ్.. ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా?

రాకింగ్ స్టార్ యశ్.. కేజీఎఫ్ సిరీస్ తో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. దీంతో తన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. అయితే కేజీఎఫ్ 2 తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు ఈ రాకింగ్ స్టార్. ప్రస్తుతం ‘టాక్సిక్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. కాగా.. ఇంత బిజీ టైమ్ లో కూడా తన వ్యక్తిత్వాన్ని మరోసారి చాటుకున్నాడు. తన కోసం పనిచేసే వారిని ఎన్నటికీ మర్చిపోకూడదని చాటిచెప్పాడు. ఈ క్రమంలోనే తన అసిస్టెంట్ ఇంటికి సడెన్ గా వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చాడు. అంతే కాదండోయ్ వారి బాబుకు ఓ భారీ గిఫ్ట్ కూడా ఇచ్చాడు.

సెలబ్రిటీలు తమ కోసం పనిచేసే వారికి ఎప్పుడూ అండగా ఉంటూనే ఉంటారు. వారి ఇంట్లో చిన్న వేడుక జరిగినా హాజరై.. తమ మంచి మనసును చాటుకుంటూ ఉంటారు. ఇక మరికొందరు సడెన్ సర్ఫ్రైజ్ లు ఇస్తూ ఉంటారు. తాజాగా కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తన అసిస్టెంట్ చేతన్ కు ఊహించని సర్ఫ్రైజ్ ఇచ్చాడు. యశ్ దగ్గర చేతన్ దాదాపు 12 ఏళ్లుగా అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే యశ్ సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి అన్నమాట. 2021లో చేతన్ వివాహం జరిగింది. ఆ పెళ్లికి సైతం యశ్ దంపతులు వచ్చి.. కొత్త దంపతులను ఆశీర్వదించారు. దీంతో అప్పుడు అందరూ యశ్ మంచి మనసును ప్రశంసించారు. ఎంత ఎదిగినా.. ఒదిగుండే తీరు, అందరిని కలుపుకొని పోయే తీరు ఆయనదని నెటిజన్లు పొగిడారు.

ఇదిలా ఉండగా.. తాజాగా మరోసారి తన అసిస్టెంట్ ఇంటికి సడెన్ గా వెళ్లి ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు ఈ స్టార్ హీరో. అసిస్టెంట్ చేతన్ దంపతులకు కొన్ని రోజుల క్రితం కుమారుడు జన్మించాడు. అయితే టాక్సిక్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉండటంతో.. వెళ్లలేకపోయాడు యశ్. కానీ తాజాగా సడెన్ గా ఇంటికి వెళ్లి.. వారి కొడుక్కి బంగారు గొలుసును కానుకగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. నెటిజన్లు యశ్ సింప్లిసిటీపై అలాగే గోల్డ్ చైన్ బహుమతిగా ఇవ్వడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి మరోసారి తన మంచి మనసును చాటుకున్న యశ్ దంపతులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: స్టార్ బాయ్ సిద్ధూ టిల్లు స్క్వేర్ ట్రైలర్ ఎలా ఉందంటే?

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss