iDreamPost
android-app
ios-app

Toxic Latest Update: యశ్ ‘టాక్సిక్’ నుంచి బిగ్ అప్డేట్! 

  • Published Aug 08, 2024 | 12:03 PM Updated Updated Aug 08, 2024 | 12:03 PM

కొన్ని రోజుల క్రితం 'టాక్సిక్' అనే టైటిల్ తో తన 19వ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఆ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు యశ్. ఆ వివరాల్లోకి వెళితే..

కొన్ని రోజుల క్రితం 'టాక్సిక్' అనే టైటిల్ తో తన 19వ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఆ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు యశ్. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Aug 08, 2024 | 12:03 PMUpdated Aug 08, 2024 | 12:03 PM
Toxic Latest Update: యశ్ ‘టాక్సిక్’ నుంచి బిగ్ అప్డేట్! 

యశ్.. కేజీఎఫ్ చాప్టర్ 1, 2 సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాలు కలెక్షన్ల వర్షం కుపించాయి. దాంతో పాటుగా యశ్ కు ఊహించని ఫ్యాన్ బేస్ ను తీసుకొచ్చాయి. అయితే కేజీఎఫ్ 2 తర్వాత ఈ స్టార్ హీరో నుంచి చాలా కాలం పాటు ఎలాంటి సినిమా అనౌన్స్ కాలేదు. దాంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. కాగా.. కొన్ని రోజుల క్రితం ‘టాక్సిక్’ అనే టైటిల్ తో తన 19వ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఆ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు యశ్.

కేజీఎఫ్ స్టార్ యశ్ తన 19వ చిత్రం ‘టాక్సిక్’ మూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. పూజా కార్యక్రమంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యిందని ట్విట్టర్ వేదికగా ఫొటోలు షేర్ చేశాడు. దాంతో సోషల్ మీడియాలో టాక్సిక్ ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్నట్లు సమాచారం. అలాగే యశ్ కు సోదరిగా నయనతార లేదా కరీనా కపూర్ ఇద్దరిలో ఒకరు నటిస్తారని తెలుస్తోంది. ఇక మరో హీరోయిన్ తారా సుతారియా మరో కీలక పాత్రలో మెరవనుందట. హ్యుమా ఖురేషీ నెగటీవ్ రోల్ లో కనిపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.

Big update from Yash's 'Toxic'!

కాగా.. టాక్సిక్ మూవీని మలయాళ నటి, డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో రాబోతున్న ఈ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత యశ్ నుంచి రాబోతున్న మూవీ కావడంతో.. పాన్ ఇండియా రేంజ్ లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఏప్రిల్ 10న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-మరుతి కాంబినేషన్ లో రూపొందుతున్న హార్రర్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’ విడుదల కానుంది. కానీ, పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ప్రభాస్ రాజా సాబ్ కు పోటీగా టాక్సిక్ రాకపోవచ్చిని సినీ పండితులు పేర్కొంటున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişcasibom