iDreamPost
android-app
ios-app

బాలయ్య అల్లుడు భరత్‌ ఆస్తులు జప్తు

బాలయ్య అల్లుడు భరత్‌ ఆస్తులు జప్తు

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్న అల్లుడు, గీతం విద్యాసంస్థల స్థాపకుడు, దివంగత ఎంవీఎస్‌ మూర్తి మనవడు శ్రీభరత్‌కు కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ షాక్‌ ఇచ్చింది. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు చెల్లింకపోవడంతోపాటు, నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో భరత్‌ తాకట్టు పెట్టిన ఆస్తుల జప్తు చేసేందుకు సిద్ధమైంది. గాజువాక, భీమిలిలో ఉన్న తన ఆస్తులను తాకట్టు పెట్టి హైదరాబాద్‌లోని కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ అబిడ్స్‌ బ్రాంచ్‌లో 124.39 కోట్ల రుణం శ్రీ భరత్‌ తీసుకున్నారు. అయితే వీటిని సకాలంలో చెల్లింకపోయారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో తాకట్టు పెట్టిన ఆస్తుల జప్తుకు బ్యాంకు పూనుకుంది.

గతంలో కూడా శ్రీభరత్‌పై బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఎగ్గొట్టారని విమర్శలొచ్చాయి. ఆంధ్రా బ్యాంకు నుంచి తీసుకున్న 13 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆ బ్యాంకు గతంలో పత్రికా ప్రకటనలు ఇచ్చింది. తాజాగా కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ నుంచి తీసుకున్న రుణాలు కూడా శ్రీభరత్‌ చెల్లించలేపోవడంతో తాజా పరిణామాలు నెలకొన్నాయి.

బాలకృష్ణ చిన్న అల్లుడైన శ్రీభరత్‌ 2019 ఎన్నికల్లో టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తొలిసారిగా పోటీ చేసిన ఎన్నికల్లో శ్రీ భరత్‌ ఓటమి చవిచూశారు. కాగా, తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం నుంచి బకాయలు రావాల్సి ఉందని భరత్‌ ట్వీట్టర్‌లో తెలిపారు. అందుకే బకాయలు చెల్లించలేకపోతున్నామన్నారు.