iDreamPost
android-app
ios-app

తాడేపల్లి బయలుదేరిన కరణం బలరాం

తాడేపల్లి బయలుదేరిన కరణం బలరాం

ప్రతిపక్ష పార్టీ టీడీపీలో మరో వికెట్‌ పడింది. టీడీపీ సినియర్‌ నేత, ఆ పార్టీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న నేత, ప్రస్తుత చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆయన పార్టీలో చేరుతున్న ప్రకటించారు. ఈ మేరకు తన అనుచరులతో కలసి తాడేపల్లి బయలుదేరారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.  

నియోజకవర్గ అభివృద్ధి, చీరాల ప్రజలకు న్యాయం చేసేందుకే తాను అధికార పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే కరణం తెలిపారు. చీరాల ప్రజలు తమ సమస్యలు తీరుస్తాననే నమ్మకంతో 20 వేల మెజార్జీతో గెలిపించారని అన్నారు. వైఎస్సార్‌సీపీ హవాలో కూడా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు తాను ఈ రోజు వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు తెలిపారు. అంతకు ముందు ఆయన తన అనుచరులు, కార్యకర్తలతో చీరాలలో సమావేశమయ్యారు. వారికి పార్టీ మార్పుపై వివరించారు. అనంతరం ఆయన మాజీ మంత్రి పాలేటి రామారావు, తన తనయుడు కరణం వెంకటేష్‌ తదితరులతో కలసి తాడేపల్లి బయలుదేరారు.

Read Also : జగన్ను కలవటం ఇప్పుడు కరణం బలరాం వంతు 

కరణం బలరాం వైఎస్సార్‌సీపీలో చేరుతారంటూ ఎన్నికలకు ముందు, తర్వాత ప్రచారం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్టీ మారడంపై కరణం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నిన్న బుధవారం కరణం అధికార పార్టీలో చేరుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి కొనసాగింపుగా ఈ రోజు తెల్లవారుజామున ఒంగోలు ఎమ్మెల్యే, విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి (వాసు) ఇంట్లో కరణం బలంరాంతో చర్చలు జరిగాయి. ఆ తర్వాతనే కరణం తన అనుచరులతో సమావేశమవడం, తాడేపల్లి బయలుదేరడం వెనువెంటనే జరిగిపోయాయి.

Read Also : కరణం వైఎస్సార్‌సీపీలో ఏ విధంగా చేరబోతున్నారు..?