iDreamPost
android-app
ios-app

ఆచార్యకి రెండో మెగా షాక్

  • Published May 02, 2020 | 6:04 AM Updated Updated May 02, 2020 | 6:04 AM
ఆచార్యకి రెండో మెగా షాక్

కరోనా వల్ల షూటింగ్ కి బ్రేక్ పడి ఇంట్లోనే టైం ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్యకు ఖాళీ టైంలో కూడా కష్టాలు వచ్చి పడుతున్నాయి. షూటింగ్ ప్రారంభానికి ముందు హీరొయిన్ దొరక్క మొదట చాలా ఇబ్బంది పడ్డారు. సరే త్రిష దొరికింది ఒప్పుకుంది కదాని సంతోషించే లోపు ఏదో క్రియేటివ్ డిఫరెన్స్ పేరుతో ప్రాజెక్ట్ కి బైబై చెప్పేసింది త్రిష. దీనికి సంబంధించిన కారణాలు ఏవేవో ప్రచారానికి వచ్చాయి కాని చిరు తర్వాత క్లారిటీ ఇచ్చాక ఆగిపోయాయి. సరే మళ్ళి ఆప్షన్స్ వెతికి కం బ్యాక్ మూవీ ఖైది నెంబర్ 150లో చేసిన కాజల్ అగర్వాల్ ను సెట్ చేసుకున్నారు.

రెమ్యునరేషన్ ఎక్కువే డిమాండ్ చేసిందన్న న్యూస్ వచ్చింది కాని దాని గురించి పెద్దగా ప్రచారం జరగలేదు. సోషల్ మీడియా వేదికగా చిరు సర్ తో చేయబోతున్నట్టు కాజల్ సంబరంగా చెప్పుకుంది కూడా. కాని తాజా అప్ డేట్ ప్రకారం ఇప్పుడు ఆచార్యకు రెండో మెగా షాక్ తగిలింది ఈ ప్రాజెక్ట్ నుంచి కాజల్ కూడా తప్పుకున్నట్టు హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. లాక్ డౌన్ అయ్యాక భారతీయుడు 2 కు బల్క్ డేట్స్ అవసరం ఉండటంతో ఆచార్య చేయలేనని కబురు పెట్టిందట. ఇంకా యూనిట్ నుంచి అధికారిక ధృవీకరణ రాలేదు.

నిప్పు లేనిదే పొగరాదు తరహాలో ఎంతో కొంత నిజం లేకపోనిదే ఇలా ఎందుకు టాక్ వస్తుందనే వారు లేకపోలేదు. ఒకవేళ వాస్తవమే అయితే కొరటాల శివ మరో పెద్ద చిక్కుముడి పడినట్టే. అసలే రెండేళ్ళు ఆలస్యంగా ఆచార్య మొదలైంది. ఎలాగూ ఈ ఏడాది రిలీజ్ చేసే ఛాన్స్ లేదు. పోనీ పరిస్థితి సద్దుమణిగాక ఫాస్ట్ గా పూర్తి చేసి సంక్రాంతికి రెడీ చేద్దామంటే ఇప్పుడీ కాజల్ బ్రేక్. తక్కువ టైంలో ఈ సమస్యని ఎలా అధిగమిస్తారో చూడాలి. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఆచార్యలో ఇప్పటిదాకా 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇందులో ఇంట్రో సాంగ్ తో పాటు రెజినాతో షూట్ చేసిన పార్టీ నెంబర్ కూడా ఉంది. కాజల్ తాలుకు కన్ఫర్మేషన్ ఇంకొద్ది రోజులలో రావొచ్చు

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobetgrandpashabet giriş