iDreamPost
android-app
ios-app

డాన్స్ లు చేసుకో…!! నీకు రాజకీయాలు ఎందుకు ??

డాన్స్ లు చేసుకో…!! నీకు రాజకీయాలు ఎందుకు ??

డాన్స్ లు చేసుకో…!!
నీకు రాజకీయాలు ఎందుకు ?? అంటూ పవన్ పై కె.ఏ.పాల్ మాటల తూటాలు  పేల్చారు

డాన్సులు చేసుకునేవాడివి నీకు రాజకీయాలు ఎందుకు ? నీకు అధికార దాహం తప్ప తెలివి లేదు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించారు ..అందుకే నిన్ను ఓడించారు అంటూ పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ పాల్ మాటల తూటాలు పేల్చారు. ఈమేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేసారు. అందులో ఆయన ఏం చెప్పారన్నది యథాతథంగా చదవండి…

తమ్ముడూ.. పవన్‌ కల్యాణ్‌ నీకు అధికార దాహం ఉంటే.. మోదీతో మంచి సంబంధాలుంటే స్పెషల్‌ స్టేటస్‌ తీసుక్చొ చూపించు. ఎందుకు నీకు రాజకీయాలు.. నీ పనులేవో.. నీ డాన్సులేవో వేసుకోవచ్చు కదా?

కాపులు, దళితులు, నిరుద్యోగులు బడుగుబలహీన వర్గాలను ఎందుకు మిస్‌గైడ్‌ చేస్తున్నావ్‌. ప్రజలు నిన్ను కోరుకోలేదు. నువ్వు 2008 నుండి రాజకీయాల్లో యాక్టివ్‌గా పని చేస్తున్నావ్‌ కదా? ప్రజలు నీ రాజకీయాలన్నీ గమనిస్తున్నారు.

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కొడుకుపై నువ్వు నిందలు వేస్తున్నావు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి మనందరం ఆయనకు సపోర్ట్‌ చేయాలి కదా? ఆయన్ని అపోస్‌ చేసి.. బీజేపీతో కలిసి స్పెషల్‌ స్టేటస్‌ తీసుకొస్తే ప్రజలు నిన్ను అభినందిస్తారు.

నిన్నటి వరకు చంద్రబాబు నాయుడుతో ఉండి ఆయన సపోర్ట్‌ తీసుకొని.. ఆయన పలుకులు పలికి ఇప్పుడు బీజేపీతో పొత్తా?

2009లో మీ అన్న కాంగ్రెస్‌తో కలిసినప్పుడు 18 శాతం ఓట్లు, అప్పుడు కాంగ్రెస్‌కు ఉన్న 40 శాతం ఓట్లు 2014కు వచ్చేసరికి 2 శాతం కూడా లేవు.

ఇప్పుడు కమ్యునిస్టులకు హ్యాండ్‌ ఇచ్చేశావ్‌.

2024లో ఎంత శాతం ఓట్లు వస్తాయ్‌ అనుకుంటున్నావ్‌?

రాష్ట్రానికి పెట్టుబుడులు తీసుకురాగలవా? డాన్స్‌లు వేస్తే పెట్టుబడులు వస్తాయా? డ్రామాలాడితే పెట్టుబడులు వస్తాయా? ప్రజలు మూర్ఖులు కారు. ప్రజలు తెలివైన వారు కనుకనే నిన్ను నమ్మలేదు. ఇప్పుడు నీ నిజ స్వరపం ప్రజలకు అర్థమైంది.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet