బిజెపి లో చేరిన జ్యోతిరాదిత్య సింధియా

  • Published - 10:37 AM, Wed - 11 March 20
బిజెపి లో చేరిన జ్యోతిరాదిత్య సింధియా

కాంగ్రెస్‌ పార్టీతో తమ కుటుంబానికున్న నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధానికి తెరదించుతూ మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎట్టకేలకు బుధవారం బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ బీజేపీలో చేరడం ద్వారా తనకు దేశానికి సేవ చేయడానికి మరింతగా అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం దేశ భవిష్యత్తు భవిష్యత్తు ప్రధాని మోడీ చేతిలో సురక్షితంగా ఉందని జ్యోతిరాదిత్య సింధియా అభిప్రాయపడ్డారు. భారతీయ జనతా పార్టీ జ్యోతిరాదిత్య సింధియా కు రాజ్యసభ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని, త్వరలోనే ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడం ఖాయమైనన్నట్టు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగిన తరువాత, తన వర్గానికి చెందిన 21 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో మధ్య ప్రదేశ్ లోని కమల్ నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. జ్యోతిరాదిత్య సింధియా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత హోలీ రోజున భూపాల్ లో అనూహ్యమైన పరిణామాలు సంభవిచాయి. ఈ నేపథ్యంలో తాజా సంక్షోభం నుండి బయటపడడానికి ముఖ్యమంత్రి కమల్ నాద్ అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలందరిని హుటాహుటిన జైపూర్ కు తరలించారు.

ప్రస్తుతం కమల్ నాద్ ప్రభుత్వానికి మెజారిటీ మార్కు కంటే కేవలం నాలుగు సీట్ల ఆధిక్యం తో 116 మొత్తం ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఈ పరిస్థితుల్లో 21 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సింధియాతో కలసి ప్రభుత్వ నుండి వైదొలిగిన నేపథ్యంలో, ఇప్పటికే రాష్ట్ర బిజెపి నేతలు కమల్ నాద్ ప్రభుత్వం బలం నిరూపించుకోవాల్సిందిగా ఆదేశించాలని ఆ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్ ను కలిశారు. సింధియా వర్గానికి చెందిన 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలోఆ రాజీనామాలను కనుక గవర్నర్ ఆమోదిస్తే కమల్ నాధ్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడం ఖాయం.

Show comments