iDreamPost
android-app
ios-app

అక్టోబర్ రెండో వారం – OTT వినోదం

  • Published Oct 13, 2022 | 4:08 PM Updated Updated Oct 13, 2022 | 4:08 PM
అక్టోబర్ రెండో వారం – OTT వినోదం

ప్రతి శుక్రవారం థియేటర్ సినిమాల తరహాలోనే స్మార్ట్ స్క్రీన్ లవర్స్ ఓటిటి ఎంటర్ టైన్మెంట్ కోసం ఎదురు చూడటం సాధారణం అయ్యింది. కాకపోతే ఈ మధ్య ఫ్రైడే సెంటిమెంట్ కు కట్టుబడకుండా గురువారం, ఆదివారాలు కూడా కొత్త రిలీజులు చేస్తున్నారు. ఈ రోజు ఆహా, అమెజాన్ ప్రైమ్ లో ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచిన కిరణ్ అబ్బవరం ఎంటర్ టైనర్ కు చిన్నితెరపై ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో శింబు హీరోగా వచ్చిన ‘ది లైఫ్ అఫ్ ముత్తు’ తమిళ వెర్షన్ ప్రైమ్ లో వచ్చేసింది. తెలుగు ఆడియో ప్రస్తుతానికి ఇవ్వలేదు. ఎప్పుడో క్లారిటీ లేదు.

విలక్షణ దర్శకుడు అనురాగ్ కశ్యప్ హీరోయిన్ తాప్సీ కాంబినేషన్ లో గత నెల రిలీజైన ‘దొబారా’ శనివారం నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఉంటుంది. థియేటర్లో డిజాస్టరే కానీ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళు ఈ స్పానిష్ రీమేక్ మీద లుక్ వేయొచ్చు. లోకల్ లాంగ్వేజెస్ లో డబ్బింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటిదాకా పే పర్ వ్యూ మోడల్ లో అందుబాటులో ఉన్న ‘జురాసిక్ వరల్డ్ డామినియన్’ ఇకపై ప్రైమ్ లో నేరుగా చూసేయొచ్చు. వెబ్ సిరీస్ లు గుడ్ బ్యాడ్ గర్ల్ (సోనీ లివ్), మిస్ మ్యాచ్డ్ (నెట్ ఫ్లిక్స్) ల మీద మంచి అంచనాలే ఉన్నాయి. మళయాలంలో సంచలన విజయం నమోదు చేసుకున్న ‘పాల్తూ జాన్వర్’ని హాట్ స్టార్ లో సబ్ టైటిల్స్ తో ఎంజాయ్ చేయొచ్చు.

తమిళ చిత్రాలు ట్రిగ్గర్(ఆహా), బఫూన్(నెట్ ఫ్లిక్స్)లు వస్తాయి. మొత్తంగా తీసుకుంటే ఎప్పుడూ సందడి చేసే తెలుగు ఓటిటి రిలీజులు ఈసారి మాత్రం చప్పగా ఉండబోతున్నాయి. థియేటర్లనూ చెప్పుకోవడానికి తొమ్మిది సినిమాలు వస్తున్నాయనే పేరే తప్ప అందులో ఒక్క ‘కాంతారా’ మీద మాత్రమే అంచనాలున్నాయి. అది కూడా కన్నడలో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయ్యింది కాబట్టి ఆ రివ్యూలు రిపోర్టులు చూసిన మన ఆడియన్స్ దాన్ని చూసేందుకు రెడీ అవుతున్నారు. మిగిలినవన్నీ కేవలం టాక్ మీద ఆధారపడ్డవే. ఈ మధ్య డీసెంట్ టాక్ తెచ్చుకున్న నాగ శౌర్య కృష్ణ వృందా విహారి వచ్చే వారం 23న నెట్ ఫ్లిక్స్ లో వస్తుంది. సో ఈ వీకెండ్ ని ఇలా సర్దుకోక తప్పదు మరి