Idream media
Idream media
జార్ఖండ్ శాసన సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కూటమి దూసుకుపోతోంది. ఉదయం 11 గంటల సమయానికి కాంగ్రెస్ కూటమి 45 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ 25 సీట్లలో, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ పార్టీ 4, జార్ఖండ్ వికాస్ మోర్చా పార్టీ 3 సీట్టలో, ఇతరులు 4 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
81 సీట్లు ఉన్న జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి 41 సీట్లు అవసరం. కాగా ప్రస్తుతం 45 సీట్లతో కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉంది. లెక్కింపు ప్రారంభం నుంచి ఆధిక్యంలో దోబూచులాడుతున్న నేపథ్యంలో తుది ఫలితాలు తర్వాతనే స్పష్టత రానుంది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, రాష్ట్రీయ జనతా దల్ కూటమి కట్టి పోటీ చేశాయి. 81 సీట్లకు గాను జార్ఖండ్ ముక్తి మోర్చా 43 సీట్లలో, కాంగ్రెస్ 31 సీట్లలో, రాష్ట్రీయ జనతా దల్ 7 సీట్లలో పోటీ చేశాయి. బీజేపీ సొంతంగా 79 సీట్లలో అభ్యర్థులను నిలబెట్టింది.