Idream media
Idream media
“అనంతపురం జిల్లాలో టీడీపీకి ఓటు బ్యాంకు ఉంది కాబట్టి మేము నాయకులు అయ్యాo. కార్యకర్తల కోసం మీటింగ్ లో పెట్టాలి గాని ఇలాంటి పనికిరాని సదస్సులు శుద్ధ దండగే. రెండేళ్ల నుంచి ఒక్కరు. కూడా టీడీపీ కార్యకర్తలను పట్టించుకోలేదు.” రాయలసీమ ప్రాజెక్ట్ లపై జల సదస్సులో భాగంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఇవి.
“నిన్నటి హంద్రీనీవా సమావేశంలో పాల్గొన్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్. శ్రీ జె సి ప్రభాకర్ రెడ్డి అన్న గారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆవేదనా వారి బాధలు సమావేశంలో తెలియజేసినారు. హంద్రీనీవా కాలువను సందర్శించడానికి ఎంతమంది నాయకులను కార్యకర్తలు పిలిచినా రు కార్యకర్తల ఆవేదన తెలియజేస్తే మీకు ఎందుకు అంత బాధ వైయస్సార్ పార్టీ వారితో కుమ్మక్కు అయినందుక ఇప్పుడైనా మించి పోయినది ఏమీ లేదు. అందరినీ కలుపుకొని పోండి మీ స్వార్థ రాజకీయాల కోసం కార్యకర్తలను బలి చేయొద్దండి”
జేసి ప్రభాకర్ రెడ్డి నేడు ఉదయం తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన వ్యాఖ్యలు ఇవి.
మరి నిన్న ఎందుకు మాట్లాడారో గాని… ఒకప్పుడు ఆ పార్టీకి కంచుకోట గా ఉన్న అనంతలో ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న జేసి కుటుంబం ఈ వ్యాఖ్యలు చేసింది కాబట్టి అందరూ వాటిని ఆసక్తికరంగా చూసారు. ఆయనకు వచ్చిన కష్టం ఏంటి అనేది పక్కన పెడితే దాదాపుగా ఏడేళ్ళ నుంచి జేసి ఫ్యామిలీ వర్సెస్ అనంత టీడీపీ గా పరిస్థితి మారింది అనేది మనం చూస్తూ ఉన్నాం.
Also Read:బుడ్డా వెంగళ రెడ్డి – పేరు గుర్తుందా?
జేసి ఫ్యామిలీ టీడీపీ కార్యకర్తల గురించి, ఆ పార్టీ అధినేత గురించి మాట్లాడటం వింతగా ఉంటే… ఆయన కొడుకు పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు చేసిన కామెంట్స్ మరీ వింతగా ఉన్నాయనే కామెంట్ వినపడుతుంది. జేసి ఫ్యామిలీ కారణంగా ఎందరో కార్యకర్తలు చచ్చిపోయారనేది టీడీపీ గతంలో చేసిన ఆరోపణ. గతంలో దివంగత పరిటాల రవీంద్ర ఉన్న సమయంలో జేసి ఫ్యామిలీ వ్యవహారాల గురించి ఘాటు కామెంట్స్ చేసే వారు. ఆయన హత్యకు ముందు కూడా జేసి ఫ్యామిలీ లక్ష్యంగా ఇంటర్వ్యూలలో కూడా మాట్లాడారు.
అలాంటి జేసి ఫ్యామిలీ… ఈ రోజు పార్టీ మీద ప్రేమ చూపించడం అనేది మాకు మింగుడు పడటం లేదని కొందరు కార్యకర్తలు అంటున్నారు. రెండేళ్ళ క్రితం జరిగిన ఎన్నికల్లో అనంతపురం ఎంపీ సీటు, తాడిపత్రి ఎమ్మెల్యే సీట్లకు గానూ జేసి బ్రదర్స్ ను పోటీ చేయమని చంద్రబాబు అడిగితే మరేం అనుకున్నారో ఏమో గాని కుమారులను రంగంలోకి దింపి ఊహించని ఎదురు దెబ్బ తిన్నారు. వారు పార్టీలోకి వచ్చిన నాటి నుంచి పెద్దగా సహకారం లేదు అని, చంద్రబాబు నుంచి కింది స్థాయి వరకు వారికి విలువ ఇవ్వడం లేదని, అప్పటి అనంత మేయర్ కి ఉన్న ప్రాధాన్యత కూడా వారికి లేదని ఘాటు కామెంట్స్ వచ్చేవి. ఇప్పటికి అక్కడక్కడ అవి వినపడుతూ ఉంటాయి.
Also Read:గుజరాత్ కొత్త సీఎం భూపేంద్ర పటేల్
పల్లె రఘునాథ రెడ్డిని, కాల్వ శ్రీనివాసులను ఆయన లక్ష్యంగా చేసుకుని ఇద్దరు నాయకులు అంటూ మాట్లాడారు. ఆ ఇద్దరినీ తిట్టడం తో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇలా అందరూ బయటకు వచ్చి కౌంటర్ లు ఇచ్చారు. పల్లె రఘునాథ రెడ్డికి తన ప్రత్యర్ధి పెద్దారెడ్డికి బంధుత్వం ఉందని జేసి అనడం పట్ల పల్లె కూడా ఘాటుగా స్పందించారు. “నా డ్రెస్సింగ్ గురించి హేళనగా మాట్లాడారు… విద్యాసంస్థలు ఏర్పాటు చేసి వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నా. నీలాగా రాజకీయ కుటుంబం కాకపోయినా మంత్రిగా ఎమ్మెల్యేగా చీఫ్ విప్ గా పదవులు పొందా. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది. పరిపక్వతతో ఆలోచించే మాట్లాడుతున్నావా.. పుట్టపర్తి నియోజకవర్గం లో 74 సర్పంచ్ స్థానాలకు పోటీ చేశాము. మీ తాడిపత్రిలో లాగా 27 పంచాయతీలో ఫోటీ పెట్టకుండా ఉండలేదు అక్కడ ఎందుకు ఏకగ్రీవం అయ్యానన్నారు.
రఘునాథ్ రెడ్డి తన కౌంటర్ ను కొనసాగిస్తూ ,నేను ఎవరికీ భయపడి ఎక్కడికి పారిపోలేదు అన్ని ఎన్నికల్లో పోటీ చేశాం. ఫ్యాక్షనిస్టు కాదు రౌడీయిజం గూండాయిజం చేయను భూములు ఆక్రమించను.
2014 ముందు వరకు ఎంత మంది టిడిపి కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు కార్యకర్తలు గుర్తుకు రాలేదా…? ఏ నినాదం లేకుండా కార్యకర్తలు గుర్తుకొచ్చారు… వారి గురించి మాట్లాడే అర్హత మాకు మాత్రమే ఉంది అని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి నాకు బంధువు.. శుభ అశుభ కార్యక్రమాల్లో కలుస్తూ ఉంటాం… రాజకీయంగా ఎలాంటి మద్దతు ఇవ్వలేదు తాడిపత్రిలో ఆయనకు మద్దతుగా ప్రచారం కూడా చేయలేదు అని స్పష్టం చేసారు. నీ మాదిరిగా రోజుకో విధంగా మాట్లాడను.. ఒకసారి జగన్మోహన్ రెడ్డి మరోసారి రాజశేఖర్ రెడ్డిని పొగుడుతావ్… టిడిపి కార్యకర్తలను ఇది అవమానించడం కాదా అంటూ ఘాటు కౌంటర్ ఇచ్చేసారు.
Also Read:పింఛన్ వద్దు,భూమి వద్దన్న ఈ మాజీ ఎమ్మెల్యే గురించి తెలుసా?
అటు పయ్యావుల, పరిటాల సునీత, ప్రభాకర్ చౌదరి కూడా ఘాటుగా మాట్లాడారు. “చర్చను తప్పుదోవ పట్టించేలా జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్యలో కల్పించుకుని మాట్లాడారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి కాల్వ శ్రీనివాసులు… అలాంటి వ్యక్తిని ఉద్ధేశించి మాట్లాడటం చాలా బాధాకరం. 24 గంటలు పార్టీ కోసం పని చేసే వ్యక్తి కాల్వ శ్రీనివాసులు. రాయలసీమ లో ముఖ్యంగా అనంతపురం జిల్లా కు జరుగుతున్న అన్యాయం పై ప్రభాకర్ రెడ్డి మాట్లాడి ఉంటే బాగుండేది అంటూ ఆమె జేసి ఫ్యామిలీకి సమాధానం ఇచ్చారు.
కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అనంత జిల్లాలో తమ రాజ్యాన్ని ఏలిన జేసి కుటుంబం టీడీపీలో కూడా అలాంటి ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని ప్రయతామ్ చేసి వివాదాల్లో చిక్కుకుని పార్టీలో ఒంటరి కావడం వలన కుమారుల రాజకీయ భవిష్యత్తు నాశనమవుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా బంధుత్వానికి రాజకీయానికి జేసి లింక్ పెట్టడం వింతగానే ఉందని అంటున్నారు పలువురు.