Idream media
Idream media
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. 9 గంటలకల్లా ఓటింగ్ సరళి తెలిసిపోతుంది. మధ్యాహ్నానికి పూర్తి వివరాలు ప్రకటిస్తారు.81 సీట్లున్న జార్ఖండ్ కాంగ్రెస్ ఆద్వర్యంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా,రాష్ట్రీయ జనతాదళ్ కూటమి, మరో పక్క బీజేపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీకి దిగాయి..
ఐదు దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో నవంబర్ 30న మొదటి దశ, డిసెంబర్ 7న రెండోదశ, 12న మూడో దశ ఓటింగ్, 16 న నాలుగో దశ ఓటింగ్, 21న ఐదోదశ ఓటింగ్ జరిగింది. తాజాగా ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్, జేఎమ్ఎమ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి.
2014లో జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. బీజేపీకి 37, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌కు 5, జార్ఖండ్ ముక్తి మోర్చా 19, కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు వచ్చాయి.లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని RJD కి 2014లో ఒక్క సీటు కూడా రాలేదు. జేవీఎం (పీ) పార్టీ తరఫున 8 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించి ఆ తర్వాత బీజేపీలో చేరిపోవడంతో అస్థిర రాజకీయాలకు చిరునామాగా ఉన్న జార్ఖండ్ లో మొట్టమొదటి సారిగా సుస్ధిర ప్రభుత్వం ఏర్పడింది..
ఈ సారి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్, జేఎమ్ఎమ్,ఆర్జేడీ కలసికట్టుగ్గా పోటీ చేశాయి. జేఎంఎం 43, కాంగ్రెస్ 31, ఆర్జేడీ 7 సీట్లలో పోటీ చేశాయి. బీజేపీ 79 సీట్లలో బరిలో సొంతంగా బరిలో దిగింది.ఇతర పార్టీలు ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 52, జార్ఖండ్ వికాస్ మోర్చా 81 సీట్లలో పోటీ చేశాయి.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ
2019 లోకసభ ఎన్నికల తర్వాత జరిగిన మహారాష్ట్ర,హర్యానా లో బీజేపీకి మిశ్రమ ఎన్నికల ఫలితాల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నరేంద్ర మోడీ, అమిత్ షా విస్తృతంగా ఝార్ఖండ్ ఎన్నికల్లో అనేక ర్యాలీలలో పాల్గొన్నారు..ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే CAB, NRC లాంటి వివాదాస్పద బిల్లుకు సంబంధించి నితీష్ కుమార్,అకాలి దళ్, లాంటి ఎన్డీయే మిత్రపక్షాల్లో ఉన్న విబేధాలు అన్ని సర్దుకొంటాయని బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు..
జార్ఖండ్ ఎన్నికల్లో ఎక్కువ సంస్థలు JMM-కాంగ్రెస్-RJD కూటమి గెలుస్తుందని ముందస్తు అంచనాలు ఇచ్చాయి. జార్ఖండ్ ఏర్పడిన తరువాత తొలిసారి ఎవరితో పొత్తులు లేకుండా బీజేపీ బరిలోకి దిగింది. మరో వైపు JMM ,కాంగ్రెస్,RJD సంపూర్ణ సీట్ల సర్దుబాటు చేసుకొని బరిలోకి దిగాయి..
కౌంటింగ్ మొదలైన మొదటి గంటలోనే ఫలితాల సరళి అర్ధమైపోతుంది.బీజేపీ గెలిస్తే మరింత దూకుడుగా వెళ్ళటం ఖాయం,ఓడిపోతే మాత్రం బీజేపీ దూకుడికి కళ్లెం పడట్లే…