విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ. 30 లక్షల సాయం

ప్రజా సంక్షేమ పాలనను అందించడమే కాదూ.. ఉద్యోగులకు బెనిఫిట్లు అందించడంలో ముందు వరుసలో ఉంటుంది జగన్ సర్కార్. తాజాగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబానికి అండగా నిలిచి.. మంచి మనస్సును చాటుకున్నారు సీఎం జగన్.

ప్రజా సంక్షేమ పాలనను అందించడమే కాదూ.. ఉద్యోగులకు బెనిఫిట్లు అందించడంలో ముందు వరుసలో ఉంటుంది జగన్ సర్కార్. తాజాగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబానికి అండగా నిలిచి.. మంచి మనస్సును చాటుకున్నారు సీఎం జగన్.

ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా కొనియాడబడుతోంది ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కార్. అలాగే తమ హయాంలో పని చేస్తున్న ఉద్యోగులకు బెనిఫిట్లు అందించడంతో పాటు ఆపద, అత్యవసర సమయాల్లో వారి కుటుంబానికి అండగా నిలుస్తోంది. అందుకు నిదర్శనమే ఈ సంఘటన. ఇటీవల ఏపీఎస్‌పీకి చెందిన కానిస్టేబుల్ సత్యకుమార్ ఓ ప్రమాదంలో మృతి చెందారు. 2005 బ్యాచ్‌కు చెందిన సత్యకుమార్ స్వస్థలం చెన్నూర్. విధి నిర్వహణలో భాగంగా బైక్ పై కడప-చెన్నై జాతీయ రహదారి పైన వెళుతుండగా.. భకారా పేట సమీపంలోని మలినేని పట్నం వద్ద చెట్టు విరిగి అతడిపై పడింది. దీంతో అక్కడిక్కడే మరణించాడు. అతడి మరణ వార్తతో ఒక్కసారిగా కుటుంబం కుంగిపోయింది.

ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది సత్య కుమార్ ఫ్యామిలి. దీంతో ఆ కుటుంబానికి అండగా నిలవాలని భావించారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తన దృష్టికి వస్తే చాలు.. కాదనకుండా చేయడంలో జగన్ ఎప్పుడూ ముందుంటారు. మరోసారి సత్యకుమార్ కుటుంబం విషయంలో పెద్ద మనస్సు చాటుకున్నారు. విధి నిర్వహణలో చనిపోయిన సత్య కుమార్ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేయడంతో పాటు ఆర్ధికంగా అండగా నిలిచారు. ప్రభుత్వం తరుఫున రూ. 30 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మాట ఇచ్చి ఆయన తాజాగా ఆ హామీని నెరవేర్చారు. సత్య కుమార్ రాజీ, కుమారుడు సంతోష్ కుమార్‌కు రూ. 30 లక్షల చెక్‌ను శుక్రవారం అందించారు. అలాగే కుమారుడికి చదువు పూర్తయ్యాక ఉద్యోగం వచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశాలిచ్చారు.

సంతోష్ ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాడు. డిగ్రీ పూర్తి చేశాక వెంటనే ఉద్యోగం కల్పించే విధంగా జీవో జారీ చేయాలని తన కార్యాలయ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. సత్య కుమార్ కుటుంబానికి, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఫ్యామిలీకి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి భరోసానిచ్చారు. సీఎం జగన్ చెక్ అందించడంతో ధన్యవాదాలు తెలిపారు సత్య కుమార్ కుటుంబం. హామీ ఇవ్వడమే కాదూ నెరవేర్చడంలోనూ ముందుంటారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ఆయన అందించిన సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments