జగన్ పథకాన్ని ఢిల్లీలో అమలు చేయనున్న కేజ్రీవాల్

ఎన్నికల సీజన్ ప్రారంభం అవ్వటమే ఆలస్యం..  పార్టీల వారీగా నాయకులు సాధ్యాసాధ్యాలు ఆలోచినచకుండా ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా మ్యానిఫెస్టో విడుదల చేస్తారు. ఆ పూట ప్రజలని ఊరించి మభ్యపెడితే చాలు అధికారం వచ్చేస్తుంది అనే ఆలోచనతో పేజీలు పేజీలు ఆచరణ సాధ్యం కాని హామీలు అచ్చువేసి పంచేస్తారు. ఎన్నికలు ముగియగానే ప్రజలకు ఇచ్చిన హామీలున్న మ్యానిఫెస్టోని చెత్త బుట్టలో పడేసి తమ దారి తాము చూసుకుంటారు అంతిమంగా మోసానికి గురయ్యేది ప్రజలే.

2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 600కు పైగా హామీలు ఇచ్చి చెప్పింది చెప్పినట్టు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదంటే మ్యానిఫెస్టోలకు రాజకీయ నాయకులు ఇచ్చే ప్రాధాన్యత అర్ధం చేసుకోవచ్చు. ఇంచు మించుగా దేశంలో ఉన్న ఆన్ని రాష్ట్రాల్లో జాతీయ పార్టీలనుండి ప్రాంతీయ పార్టీల వరకు పాటించే పద్దతి ఇదే. కానీ 2019 ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ దేశంలో మొట్టమొదటిసారిగా మ్యానిఫెస్టో ని భగవద్గీతగా, ఖురాన్ గా, బైబిల్ గా భావిస్తాను అని చెప్పి మ్యానిఫెస్టోకు తాను ఇచ్చే విలువను ప్రజలకు తెలిసేలా చేశారు. అధికారంలోకి వచ్చిన 7నెలల్లోనే 90% మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నేరవేర్చి దేశానికే ఆదర్శంగా నిలిచి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.

Read Also: జగన్ కి కృతజ్ఞతలు చెప్పిన తమిళనాడు ముఖ్యమంత్రి

అనుభవం లేని యువకుడు, పరిపాలన చేసే పరిణతి లేని మనిషి అని విమర్శలను పటాపంచలు చేస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల మనస్సు గెలుచుకునే విధంగా సాగుతున్న పాలనపై ఇప్పటికే పలు రాష్ట్రాల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దిశా చట్టం అమలులోకి తెచ్చి పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు అస్సాం కు చెందిన మత్యకారులను విడిపించి ఆ రాష్ట్రంలో కూడా ప్రజల మన్ననలు పొంది వార్తల్లో నిలిచారు. పొరుగు రాష్ట్రానికి నీరు అందించి వారి దాహార్తి తీర్చి పలనిస్వామి నుండి ప్రశంసలు అందుకున్నారు.

ఇక తాజాగా ఫిబ్రవరి 8న జరగబోయే దేశ రాజధాని డిల్లీ ఎన్నికల్లో ఓటర్ల మన్ననలు పొందే విధంగా అన్ని పార్టీలు తమ మ్యానిఫెస్టోని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీలో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ ఆప్ పార్టి తమ మ్యానిఫెస్టోలో జగన్ బ్రెయిన్ చైల్డ్ గా పేరొందిన ఇంటి వద్దకే రేషన్ పథకానికి ప్రాధాన్యతని ఇచ్చి తమ హామీల్లోకెల్లా ప్రముఖమైన హమీగా ప్రచారం మొదలు పెట్టింది. సుమారు 1.73కోట్ల ఓటర్లుగా ఉన్న ఢిల్లీ వాసుల నుండి ఈ పథకానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది.

Read Also: జగన్ ని అభినంధించిన మహరాష్ట్ర ముఖ్యమంత్రి…

దేశంలో ఇంచుమించుగా అన్ని రాష్ట్రాల్లో నిత్యవసర వస్తువులు రేషన్ ద్వారా పంపిణి జరుగుతూనే వున్నాయి. సబ్సిడిపై లభించే ఈ నిత్యవసర వస్తువులు కోసం లబ్దిదారులు తమ పనులు మానుకుని క్యూలో నిలబడటం వలన మధ్య దిగువ తరగతికి చెందిన వీరికి ఆ రెండు రోజులు ఉపాధి కోల్పోయి పరోక్షంగా ఆదాయం కూడా కొల్పొతున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటికే రేషన్ పంపిణి చేసే ఆలోచన చేసింది. దీని నుండి స్పూర్తి పొందిన ఆప్ పార్టి అధినేత క్రేజ్రీవాల్ కూడా పూర్తి అధ్యయనం తరువాత తమ మ్యానిఫెస్టోలో కూడా ఇంటి వద్దకే రేషన్ పంపిణి చేస్తాం అని ప్రకటించారు.

యువకుడు అనుభవం లేని వాడు, పాలన పరంగా పరిణతి చెందాల్సిన వ్యక్తి అని జగన్ పై వచ్చిన విమర్శలకు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న జగన్ పథకాలే సమాధానం చెబుతున్నాయి అని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు తమ వాదనను వినిపిస్తున్నారు. ఏది ఏమైనా జగన్ సాంప్రదాయ రాజకీయనాయకులకు విరుద్దంగా ఆచరణ సాధ్యమయ్యే పథకాలు ప్రవేశపెట్టి దేశంలోని ఇతర పార్టీలకు స్పూర్తిగా నిలవడం మంచి విషయంగానే చూడాలి…

Show comments