iDreamPost
android-app
ios-app

Modi: ఉచిత బస్సు ప్రయాణంపై మోదీ కీలక వ్యాఖ్యలు.. చంద్రబాబుకు షాక్‌..

  • Published May 18, 2024 | 2:07 PM Updated Updated May 18, 2024 | 2:07 PM

Free Bus Journey: ఉచిత బస్సు ప్రయాణంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతో ఏపీలోని విపక్ష కూటమికి విపత్కర పరిస్థితి ఎదురయ్యింది. ఆ వివరాలు..

Free Bus Journey: ఉచిత బస్సు ప్రయాణంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతో ఏపీలోని విపక్ష కూటమికి విపత్కర పరిస్థితి ఎదురయ్యింది. ఆ వివరాలు..

  • Published May 18, 2024 | 2:07 PMUpdated May 18, 2024 | 2:07 PM
Modi: ఉచిత బస్సు ప్రయాణంపై మోదీ కీలక వ్యాఖ్యలు.. చంద్రబాబుకు షాక్‌..

ఉచిత బస్సు పథకం అనేది ఎన్నికల్లో కీలక హామీగా మారింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఇది అమల్లోకి వచ్చింది. గతేడాది జరిగిన తెలంగణ ఎన్నికల్లో ఉచిత బస్సు ప్రయాణం హామీ కాంగ్రెస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పథకం కింద.. ఆయా రాష్ట్రాల్లోని మహిళలు.. బస్సుల్లో.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. వెంటనే దీన్ని అమలు చేసింది. ఫలితంగా ప్రస్తుతం బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఉచిత జర్నీ హామీ నేపథ్యంలో.. బస్సుల్లో ప్రయాణం చేసే మహిళల సంఖ్య బాగా పెరుగుతోంది. దీని వల్ల ఆర్టీసీకి ఆదాంయ కూడా భారీగానే పెరుగుతోంది. అయితే ఉచిత జర్నీ వల్ల రద్దీ పెరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఉచిత బస్సు ప్రయాణం పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకాన్ని తప్పు పట్టారు.

ఫ్రీ జర్నీ పథకంపై మోదీ వ్యాఖ్యలు చూస్తే.. చంద్రబాబుకు భారీ షాక్‌ తగలనుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సారి ఏపీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా.. తమను గెలిపిస్తే.. ఏపీలో మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే దీనిపై మోదీ తాజాగా చేసిన వ్యాఖ్యలు కూటమి ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా ఉండటంతో.. రాజకీయ వర్గాల్లో సంచనలంగా మారింది.

ఉచిత బస్సు ప్రయాణం పథకంపై మోదీ మాట్లాడుతూ.. ఫ్రీ జర్నీ పథకం వల్ల మెట్రోకు భారీ నష్టం వాటిల్లుతుంది అన్నారు. ఈ పథకం వల్ల మెట్రోలో ప్రయాణించే మహిళల సంఖ్య తగ్గడమే కాక రద్దీ తగ్గిందని.. ఇలా చేస్తే భవిష్యత్తులో మెట్రోలు వస్తాయా అని మోదీ ప్రశ్నించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఫ్రీ జర్నీ పథకంపై ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే మోదీ వ్యాఖ్యలు ఏపీలో కూటమి నేతలను ఇరుకునపడేశాయి. ఉచిత ప్రయాణం వల్ల రాబోయే రోజుల్లో కచ్చితంగా మెట్రో నిర్మాణం జరగకుండా అడ్డుపడుతుందని మోదీ అభిప్రాయపడ్డారు.. అయితే ఇలాంటివన్నీ ఎవరు ఆలోచించారు కేవలం ఎన్నికలలో లబ్ధి పొందడానికి ఇలాంటి హామీలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక మోదీ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష కూటమి ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణానికి ఆయన మద్దతు లేనట్లే అని అర్థం అవుతుంది. మళ్లీ కేంద్రంలో బీజీపీ అధికారంలోకి వస్తే.. ఇలాంటి హామీల అమలకు సహకరించదనే వాదన కూడా వినిపిస్తోంది. దాంతో చంద్రబాబు అండ్‌ కోకు భారీ షాక్‌ తప్పదనే అభిప్రాయం వెలువడుతోంది.