ఆస్తుల కేసు విచారణలో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సిబిఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్ ని కొట్టివేస్తూ సిబిఐ ప్రత్యేక కోర్ట్ గత శుక్రవారం ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ జగన్ తరపు లాయర్లు సోమావారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Read Also: జగన్ పిటిషన్ కొట్టివేత..
ముఖ్యమంత్రి గా పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉండడంతో పాటు ముఖ్యమంత్రికున్న ప్రత్యేక భద్రతా దృష్ట్యా సిఆర్పీసీ లోని సెక్షన్ 205 ప్రకారం తన తరుపున తన న్యాయవాది కోర్టుకి హాజరయ్యేందుకు అనుమతించాలని కోరుతూ గతవారం రెండవసారి పిటిషన్ దాఖలు చెయ్య,గా ఆ వాదనని సిబిఐ ప్రత్యేక కోర్ట్ తోసిపుచ్చుతూ తదుపరి విచారణ కు జగన్ మోహన్ రెడ్డి తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. కాగా ఈ ఆదేశంపై అయన హైకోర్టులో అప్పీలు చేశారు. ఈ వాజ్యం మంగళవారం హైకోర్టులో విచారణకి వచ్చే అవకాశం ఉంది. విచారణలోహై కోర్టు జగన్ విన్నపాన్ని మన్నిస్తుందా..? లేదా.? అనే ఉత్కంఠ నెలకొంది.