iDreamPost
iDreamPost
ఇటలీలో కరోనా వైరస్ దెబ్బకు అందరూ వణికిపోతున్నారు. వైరస్ దెబ్బకు ఇప్పటికి దాదాపు 85 వేలమంది బాధితులైపోయారు. వీళ్ళు కాకుండా మరో 12500 మంది మరణించారు. బాధితుల సంఖ్య, మరణాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఒక విధంగా వైరస్ ను నియంత్రించటంలో ఇటలీ ప్రభుత్వం చేతులెత్తేసినట్లే అనుకోవాలి. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే మరణిస్తున్న వారి సంఖ్య ప్రతిరోజు పెరిగిపోతుండటంతో వాటిని ఖననం చేయటం తలకు మించిన భారమైపోతోందట.
రోజుకు కొన్ని వందల మంది చనిపోతుండటంతో డెబ్ బాడీస్ ను ఖననం చేయటానికి అక్కడి ప్రభుత్వం టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేసింది. అవును మీరు చదివింది నిజమే. డెడ్ బాడీస్ ను టోకెన్ సిస్టమ్ ఇచ్చి వాళ్ళ కుటుంబసభ్యులకు అప్పగించేస్తున్నారు. దాంతో మరణించిన వాళ్ళ విషయంలో కుటుంబసభ్యులు గందరగోళంలో పడిపోతున్నారు. డెడ్ బాడీస్ ను కూడా అప్పటికప్పుడు ఖననం చేయలేని పరిస్ధితి ఎందుకొచ్చింది ?
ఎందుకంటే కరోనా వైరస్ ఎటాక్ అవ్వటం వల్ల చనిపోతున్నారు కాబట్టి వెంటనే వాళ్ళని ఖననం చేయటం సాధ్యం కావటం లేదట. డెడ్ బాడీస్ ను ఖననం చేయటానికి ముందు కొంత ప్రాసెస్ ఉంటుందట. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా వైరస్ కొన్ని గంటల పాటు బతికే ఉంటుందట. పొరబాటున డెడ్ బాడిని ఎవరైనా ముట్టుకుంటే వైరస్ వాళ్ళకు కూడా వచ్చేస్తుందని భయపడుతున్నారు.
అందుకనే వైరస్ తో చనిపోయే వాళ్ళ బాడీస్ ను ఓ ప్రత్యేక పద్దతిలో ప్యాక్ చేస్తున్నారట. ఖననం చేయకూడదన్న ఉద్దేశ్యంతో ఎలక్ట్రిక్ క్రిమిటోరియంలో కాల్చేస్తున్నారట. ఎలక్ట్రిక్ క్రమిటోరియంలో బాడీస్ ను కాల్చేయాలంటే బాగా టైం పడుతోందట. అందుకనే వచ్చిన బాడీస్ ను వచ్చినట్లు ఎటక్ట్రిక్ క్రిమిటోరియంలో కాల్చేయలేకపోతున్నారు. దాంతో ప్రతీ డెడ్ బాడీకి బాగా టైం పడుతోందట. ఎందుకంటే రోజుకు వందల మంది చనిపోతుండటంతో సరిపడా ఎలక్ట్రిక్ క్రిమిటోరియంలు కూడా లేవు. అందుకనే బాధాకరమే అయినా వచ్చిన బాడీలను ఎలక్ట్రిక్ క్రిమిటోరియంలో కాల్చేందుకు టోకెన్ నెంబర్లు ఇస్తున్నారట.