iDreamPost
android-app
ios-app

Tollywood : మన సినిమాకు మాత్రమే ఇది సాధ్యమయ్యింది

  • Published Oct 31, 2021 | 5:50 AM Updated Updated Oct 31, 2021 | 5:50 AM
Tollywood : మన సినిమాకు మాత్రమే ఇది సాధ్యమయ్యింది

ఇంకో రెండు నెలల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. 2020 కరోనా తాలూకు పీడకలలు పూర్తిగా విడిపోక ముందే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ తర్వాత మరోసారి ఆ మహమ్మారి విరుచుకుపడటం సినీ పరిశ్రమను మళ్ళీ కుదేసింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితే అయినప్పటికీ త్వరగా కోలుకుంది ఖచ్చితంగా టాలీవుడ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇక ఈ పది నెలల పరిణామాలను ఒక్కసారి చూసుకుంటే పలు విషయాలు స్పష్టమవుతాయి. ఇప్పటిదాకా పెట్టుబడి మీద భారీ లాభాలు ఇచ్చిన సినిమాలుగా అయిదు చెప్పుకోవచ్చు. ఉప్పెన, జాతి రత్నాలు, వకీల్ సాబ్, క్రాక్, లవ్ స్టోరీ డిస్ట్రిబ్యూటర్ల పంట పండించాయి.

ఇక ఊహించని విధంగా ఎస్ఆర్ కల్యాణ మండపం రూపాయికి రెండు రూపాయల లాభంతో చిన్న సినిమాల్లో పెద్ద హిట్టుగా నిలిచింది. రాజరాజ చోర సైతం హిట్టే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బ్రేక్ ఈవెన్ దాటేసినప్పటికీ ఇంకా ఫైనల్ స్టేటస్ తేలడానికి ఇంకో వారం రోజులు పట్టొచ్చు. రంగ్ దే, సీటిమార్ లాంటివి ఓపెనింగ్స్ చక్కగా తెచ్చినప్పటికీ వాటి రన్ పూర్తయ్యేనాటికి నష్టాలనే మిగిల్చాయి. రెడ్, మాస్టర్ లు సంక్రాంతి సీజన్ ను వాడుకుని ప్రాఫిట్స్ ఇవ్వగా అల్లుడు అదుర్స్ కు డిజాస్టర్ దెబ్బ తప్పలేదు. ఒక్క పాట తెచ్చిన హైప్ పుణ్యమాని 30 రోజుల్లో ప్రేమించడం ఎలా గట్టెక్కింది. జాంబీ రెడ్డి సైతం సేఫ్ ప్రాజెక్ట్ గానే నిలిచింది.

అంచనాలు బాగున్నా వాటిని కనీస స్థాయిలో అందుకోలేక శ్రీకారం, బంగారు బుల్లోడు, మోసగాళ్లు, అరణ్య, ఇష్క్, శ్రీదేవి సోడా సెంటర్, గల్లీ రౌడీ, రిపబ్లిక్, కొండపొలం లాంటివి వారం రోజులకే డెఫిషిట్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఓటిటిలో హిట్టు ఫ్లాపు అనే భేదాలు ఉండవు కాబట్టి ఆయా యాప్ లకు వ్యూస్ పరంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. జనవరిలో సూపర్ ఓవర్ తో మొదలుపెట్టి ఇటీవలే రిలీజైన ఫ్యామిలీ డ్రామా దాకా చాలానే డిజిటల్ లో వచ్చాయి. మొత్తానికి ఈ 10 నెలల కాలం చూసుకుంటే విజయాల శాతం ఇరవై కంటే తక్కువగానే ఉంది. మొన్న వచ్చిన వరుడు కావలెను, రొమాంటిక్ లు కూడా డివైడ్ టాక్ తోనే నడుస్తున్నాయి. రాబోయే రెండు నెలల్లో భారీ ఎత్తున సినిమాలు విడుదల కాబోతున్న తరుణంలో బాక్సాఫీస్ వద్ద సందడి రెట్టింపు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి

Also Read : Puneeth Rajkumar : స్ఫూర్తిని కొనసాగించమని వెళ్ళిపోయిన కన్నడ పవర్ స్టార్

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet