iDreamPost

Ravi Teja Khiladi : ఇంత వ్యంగ్యంగా హీరో మాట్లాడ్డం వింతే

Ravi Teja Khiladi : ఇంత వ్యంగ్యంగా హీరో మాట్లాడ్డం వింతే

రేపు విడుదల కాబోతున్న మాస్ మహారాజా రవితేజ ఖిలాడీ నెల రోజుల తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అవుతోంది. దీంతో పాటు ఎఫ్ఐఆర్, సెహరి కూడా రిలీజవుతున్నప్పటికీ ఇమేజ్ హైప్ పరంగా ఆ రెండు ఖిలాడీ దరిదాపుల్లో కూడా లేవు. సరే సినిమా ఎలా ఉందనేది రేపీపాటికి తెలిసిపోయి ఉంటుంది కానీ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ స్పీచులోని మాటలు పలు అనుమానాలు రేకెత్తించిన మాట వాస్తవం. ముఖ్యంగా సాంకేతిక నిపుణులను తెగ పొగిడిన మాస్ రాజా దర్శకుడు రమేష్ వర్మను మాత్రం ఆయన టాలెంట్ ని హై లైట్ చేయకుండా అదృష్టవంతుడని అర్థం వచ్చేలా నొక్కి చెప్పడం మీడియాను సైతం ఆశ్చర్యపరిచింది.

ఇక్కడితో అయిపోలేదు. నిర్మాత కోనేరు సత్యనారాయణను ఉద్దేశించి సెట్స్ కు రెగ్యులర్ గా వస్తూ ఉండండి, అన్నీ చూసుకోండి, చాలా విషయాలు మీకు తెలియవు అంటూ పబ్లిక్ స్టేజి మీదే చెప్పేయడంతో యూనిట్ సైతం ఆశ్చర్యపోయింది. అంటే బయటికి కనిపించని వ్యవహారాలు చాలా జరిగాయని నేరుగా చెప్పేసినట్టే. ఇలాంటి వాటికి సాధారణంగా దర్శకుడే బాధ్యుడు అవుతాడు. కెప్టెన్ అఫ్ ది షిప్ కాబట్టి. సో రవితేజ ఏ ఉద్దేశంతో అన్నా ఇవి డైరెక్టర్ కే తగిలిన మాట వాస్తవం. ఇంతే కాదు రచయిత శ్రీకాంత్ విస్సా ఈ కథ చెప్పకపోతే అసలు ఖిలాడీని చేసేవాడిని కాదన్న రవితేజ అతన్ని ప్రత్యేకంగా ఆహ్వానించి హై లైట్ చేయడం గమనార్హం.

ఇంత అభిమానం రమేష్ వర్మ మీద చూపకపోవడమే ఈ డిస్కషన్ కి కారణమయ్యింది. ఖిలాడీ నిర్మాణంలో విపరీతమైన జాప్యం జరగడం, వ్యయం కూడా అనుకున్న అంచనాలను బాగా దాటిపోవడం, రవితేజ ఎక్కువ కాల్ షీట్స్ ఇవ్వాల్సి రావడం లాంటి కారణాలు ఎన్నో ఇంత లేట్ అవ్వడానికి దోహదం చేశాయి. లేదంటే పుష్ప, అఖండల తరహాలోనే డిసెంబర్ లో వచ్చి బాగా వర్కౌట్ చేసుకునేది. ఇటీవలి కాలంలో ఒక హీరో ఈ స్థాయిలో స్టేజి మీద ఇలా వ్యంగ్యంగా మాట్లాడ్డం ఇదే అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ అని అరుస్తూ ఉండగా రవితేజ నేనూ అదే అనుకుంటున్నానని చెప్పారు తప్ప ఖచ్చితంగా అవుతుందని గ్యారెంటీ ఇవ్వలేదెందుకో

Also Read : Unstoppable With NBK : అక్కడా బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి