iDreamPost
android-app
ios-app

Pushpa : ‘పుష్ప’లో సమంత ఐటెం సాంగా.. ఇంకేమన్నా ఉందా?

Pushpa : ‘పుష్ప’లో సమంత ఐటెం సాంగా.. ఇంకేమన్నా ఉందా?

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ముందుగా ఓకే భాగంగా విడుదల చేయాలని అనుకున్నారు కానీ ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత నిడివి పెరిగి పోతుండటంతో రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.. అందులో భాగంగానే మొదటి భాగం పుష్పాది రైజ్ పేరిట డిసెంబర్ 17వ తేదీన విడుదల కాబోతోంది. అయితే రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్ ముందే పూర్తి చేయాలని నిర్ణయించుకున్న సుకుమార్ ఇప్పటికే ఆ పనిలో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో సమంత ఐటం సాంగ్ చేయబోతుంది అంటూ పెద్దఎత్తున ప్రచారం మొదలైంది. సమంత విడాకులు ప్రకటన తర్వాత ప్రతి విషయంలోనూ సమంత పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

అందులో భాగంగానే ఆమె ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతోంది అంటూ ప్రచారం మొదలైంది. అయితే నాగచైతన్య విడాకులు సమయంలోనే సమంతదే తప్పు అన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సమంత ఎవరితోనో ఎఫైర్ పెట్టుకుందని, ఆమె చేస్తున్న బోల్డ్ సినిమాలు అక్కినేని కుటుంబానికి నచ్చడం లేదని అందుకే విడాకులు వచ్చాయి అంటూ ప్రచారం జరుగుతుండటంతో దానిని భరించలేక ఆమె కోర్టుకు వెళ్లి మరి పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో సమంత ఐటం సాంగ్ చేయడానికి ఒప్పుకుంటుందా అంటే అందుకు అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు.

ఎందుకంటే సమంత పరువు నష్టం దావా వేసినా సరే సోషల్ మీడియాలో మాత్రం ఆమె మీద ఇంకా నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఒకవేళ సమంత గనుక ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తే అక్కినేని అభిమానులు ఇంకా రెచ్చిపోయే అవకాశం కనిపిస్తోంది. నిజానికి తన బాధ నుంచి బయట పడేందుకు వీలైనంత ఎక్కువ సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్న సమంత, సుకుమార్ అడగటంతో కాదనలేక ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకుందని ప్రచారం జరిగింది. చేస్తే చేయవచ్చు కానీ చేసిన తర్వాత దాన్ని అన్ని పరిణామాలకు సమంత బాధ్యురలిగా ఉంటుంది. అందుకే ఆమె ఐటెం సాంగ్ చేయడం అసాధ్యం అని చెప్పాలి.

Also Read : Ghani Teaser : ఎమోషన్ల యుద్ధంతో స్పోర్ట్స్ డ్రామా

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis girişesrar satın algrandpashabet