రాఖీ భాయ్ వస్తున్నట్టా రానట్టా

పాన్ ఇండియా సినిమాల్లో ఆర్ఆర్ఆర్ స్థాయిలో అంచనాలు మోస్తున్న కెజిఎఫ్ 2 రిలీజ్ తాలూకు ఎలాంటి సమాచారం బయటికి రావడం లేదు. అదిగో ఇదిగో అంటూ మీనమేషాలు లెక్కబెడుతున్నారే తప్ప ఫలానా టైంలో వస్తామని కనీసం హింట్ కూడా ఇవ్వడం లేదు. మరోవైపు ఒక్కొక్కరుగా విడుదల తేదీలను లాక్ చేసుకుంటున్న తరుణంలో రాఖీ భాయ్ ఎప్పుడు బరిలో దిగుతాడనేది సస్పెన్స్ గా మారిపోయింది. డిసెంబర్ లో పుష్ప 1కు పోటీగా రావొచ్చని ఊహాగానాలు చెలరేగాయి కానీ బన్నీ మూవీకి వస్తున్న హైప్ చూసి అనవసరంగా ఫేస్ టు ఫేస్ క్లాష్ వద్దనుకుంటున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఈ నేపథ్యంలో ఇది పలు చర్చలకు దారి తీస్తోంది.

అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ వచ్చే అవకాశాలు దాదాపు తగ్గిపోవడంతో ఆ డేట్ మీద చాలా మంది కన్నేశారు. అందులో చిరంజీవి ఆచార్య కూడా ఉంది. కాకపోతే ఆ టైంకంతా రెండు పాటల బాలన్స్, పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం సెన్సార్ తో సహా పూర్తవుతుందా అనేది అనుమానమే. ఒకవేళ అది మిస్ అయితే బాలయ్య అఖండ కూడా లైన్ లో ఉంది. కెజిఎఫ్ 2 కనక ఈ స్లాట్ ను తీసుకోవాలనుకుంటే మాత్రం మిగిలినవాళ్లు సైడ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవడం ఫ్యాన్స్ ని నిరాశపరుస్తోంది. వచ్చే వినాయక చవితి పండక్కు ఏదైనా అనౌన్స్ మెంట్ ఉండొచ్చని ఆశిస్తున్నారు.

భయపడినట్టు కరోనా థర్డ్ వేవ్ ముప్పు అంతగా లేకపోవడంతో పెద్ద సినిమాలు సైతం మెల్లగా థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్ నుంచి ఈ ప్రవాహం ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. ఆల్రెడీ కొన్ని ప్రకటనలు వచ్చేశాయి కూడా. పబ్లిక్ సినిమా హాళ్లకు రావడం సంకోచించడం లేదని కలెక్షన్లని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడేదైనా పెద్ద బొమ్మ వచ్చిందంటే వారం పది రోజులు ఈజీగా హౌస్ ఫుల్ బోర్డులు పడతాయి. ఏపిలో యాభై శాతం ఆక్యుపెన్సీతోనే వసూళ్లు బాగున్నప్పుడు ఇక పూర్తిగా అనుమతులు వస్తే క్రేజీ మూవీస్ కి ఢోకా ఉండదు. మరి రాఖీ భాయ్ ఈ చిక్కుముడిని విడదీసి డేట్ ఎప్పుడు చెప్తాడో

Also Read : యంగ్ టైగర్ ఆప్షన్లు ఇద్దరేనా

Show comments