iDreamPost
android-app
ios-app

మోక్షజ్ఞ ఎంట్రీకి బాలయ్య ప్లానింగ్?

  • Published Sep 08, 2022 | 2:15 PM Updated Updated Sep 08, 2022 | 2:15 PM
  • Published Sep 08, 2022 | 2:15 PMUpdated Sep 08, 2022 | 2:15 PM
మోక్షజ్ఞ ఎంట్రీకి బాలయ్య ప్లానింగ్?

గత ఐదారేళ్ళుగా నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే జరిగే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతానికి కుర్రాడు ఎప్పటిలాగే బొద్దుగా నార్మల్ గా ఉండటంతో ఇంతకీ హీరో అవుతాడా లేదానే అనుమానం ప్రేక్షకుల్లో అంతకంతా పెరుగుతూ పోతోంది. అయితే బాలయ్య ఎప్పటికప్పుడు దాటవేస్తూ వచ్చారు కానీ ఫలానా టైంలో ఏడాదిలో రంగప్రవేశం చేయిస్తానని చెప్పలేకపోయారు. ఇప్పుడు ఇంకో ఏడాది లేదా అంతకన్నా కొంత ఎక్కువ టైం తీసుకుని సరైన స్క్రిప్ట్ తో పరిచయం చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయట. ఆ మధ్య స్వీయ దర్శకత్వంలో ఆదిత్య 999 అని బాలకృష్ణ అన్నారు కానీ అది డౌటే.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ రాహుల్ సంక్రుత్యాన్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ లాంచ్ ఉండొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఆ మధ్య పూరి పేరు వినిపించింది. కానీ లైగర్ తీసిన విధానం చూశాక ఆయన చేతుల్లో పెట్టడం అనుమానమే. అనిల్ రావిపూడి అన్నారు కానీ ఎంటర్ టైనర్లకు బ్రాండ్ గా మారిపోయిన తనతో స్టార్ హీరో ఫ్యామిలీ వారసుడిని లాంచ్ చేయించడం మాస్ కోణంలో రిస్క్ అవొచ్చు. అందుకే రాహుల్ అయితే స్టైలిష్ గా చూపించడంతో పాటు మాస్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇటీవలే మోక్షజ్ఞ బర్త్ డేని ఫ్యాన్స్ ఘనంగా జరుపుకున్నారు.

వీళ్ళు ఇలా డిమాండ్ చేయడానికి కారణం లేకపోలేదు. ఎన్టీఆర్ మూడో తరంలో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే ఫామ్ లో ఉన్నాడు. స్టార్ లీగ్ లో చేరాడు. మిగిలిన ఎవరూ సక్సెస్ కాలేదు. తారకరత్న ఎంతో హడావిడితో ఎంట్రీ ఇస్తే కొంత కాలానికే కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఆ కుటుంబంలో ఇంకే మగ సంతానం హీరో కావాలని ప్రయత్నించిన దాఖలాలు లేవు. తారక్ అంటే హరికృష్ణ సంతానం. కానీ నాలుగు దశాబ్దాలుగా తెరమీద స్టార్ డం అనుభవించిన బాలయ్య కొడుగ్గా మోక్షజ్ఞని తెరమీద చూడాలని అభిమానుల తాపత్రయం. మరి బాలకృష్ణ వాళ్ళ మనోగతం తెలుసుకుని వీలైనంత త్వరగా తీసుకొస్తారా లేక శోభన్ బాబు తరహాలో వదిలేస్తారా చూడాలి

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş