iDreamPost

చంద్రబాబు ఓవర్ యాక్షన్ చూస్తున్నారా ? కరోనా థర్డ్ స్టేజిలో ఉందట ?

చంద్రబాబు ఓవర్ యాక్షన్ చూస్తున్నారా ? కరోనా థర్డ్ స్టేజిలో ఉందట ?

జరుగుతున్నది చూస్తుంటే అదే అనుమానం పెరిగిపోతోంది. కరోనా వైరస్ సమస్య మొదలైనప్పటి నుండి చంద్రబాబునాయుడు చేస్తున్న చేష్టలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి జనాలకు జాగ్రత్తలు చెప్పటం, అధికారులు సక్రమంగా పనిచేయటం లేదని మండిపడటం, వైరస్ సమస్యపై ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఏమి చెప్పింది ? ప్రపంచదేశాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే విషయాన్ని పదే పదే జనాలకు వినిపిస్తున్నారు. వైరస్ ను ఎదుర్కోవటంలో ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేయాలో కూడా చంద్రబాబు చెప్పేస్తున్నాడు.

సరే ఏదోలే ప్రచారానికి బాగా అలవాటైన ప్రాణం కదా అందుకే ఊరికే కూర్చోలేకపోతున్నాడని చాలామంది సరిపెట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఏపిలో కరోనా వైరస్ థర్డ్ స్టేజిలోకి వెళ్ళిపోయిందనే విషప్రచారం మొదలుపెట్టాడు. తనకు మద్దతుగా ఉండే మీడియాతో విపరీతమైన ప్రచారం చేయిస్తున్నాడు. రాష్ట్రంలో 380 కేసులున్నాయి. చనిపోయిన వారి సంఖ్య సింగిల్ డిజిట్ దాటలేదు. అయినా చంద్రబాబు దృష్టిలో రాష్ట్రంలో వైరస్ చాలా భయంకరంగా ఉందట. నిజానికి ఏపిలో కన్నా బాధితులు, మృతుల సంఖ్య నమోదైన రాష్ట్రాలు చాలా ఉన్నాయన్న విషయాన్ని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మరచిపోయినట్లున్నారు.

అదే సమయంలో వివిధ రాష్ట్రాల్లో లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన తెలుగువాళ్ళ కోసం లేఖలు కూడా రాసేస్తున్నాడు. ఆమధ్య పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ సిఎంలకు కూడా లేఖలు రాసేశాడు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రితో పాటు కేంద్ర హోం శాఖ కార్యదర్శికి కూడా లేఖలు రాశాడు. తమిళనాడులో చిక్కుకున్న తెలుగు వాళ్ళని రక్షించాలని, వాళ్ళని స్వస్ధలాలకు చేర్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ లేఖలు రాయటమే విచిత్రంగా ఉంది.

మామూలుగా ముఖ్యమంత్రి చేయాల్సిన పనులను కూడా ప్రతిపక్షంలో ఉంటూ చంద్రబాబు చేసేస్తున్నాడు. పోనీ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవటంలేదు కాబట్టే చంద్రబాబు చేస్తున్నాడా ? అంటే అదికూడా కాదు. ఒకవైపు వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తెలుగువాళ్ళ విషయంలో ఆయా రాష్ట్రాలకు జగన్ అప్పీలు చేయటంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో లేఖలు రాయిస్తునే ఉన్నాడు.

మామూలుగా ప్రతిపక్షాల నేతలు ప్రభుత్వానికి లేఖలు రాయటంతోనే ఆగిపోతారు. కానీ చంద్రబాబు అయితే నిపుణులతో ఏకంగా వీడియో కాన్ఫరెన్సే నిర్వహించేస్తున్నాడు. నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏమి చేస్తాడు ? ఏమి చేస్తాడంటే ప్రభుత్వాన్ని తప్పులు పడుతూ ప్రతిరోజు లేఖలు రాస్తున్నాడంతే. వాస్తవ పరిస్ధితులను మరచిపోయి ప్రభుత్వాన్ని తప్పులు పడుతు లేఖలు రాయటం, మీడియా సమావేశాల్లో రెచ్చిపోవటమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. బహుశా తాను ప్రతిపక్షంలో ఉన్న విషయాన్ని మరచిపోయాడో లేకపోతే ఇంకా అధికారంలోనే ఉన్నాననే భ్రమలో ఉన్నాడో తెలీటం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి