భారత్‌ బలానికి నిదర్శనం.. డాక్టర్లకు సంఘీభావ కార్యక్రమం..

భారత్‌ దేశం బలానికి ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు జరిగిన సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఆపత్కాలంలో దేశం మొత్తం ఏకమైంది. కరోనాపై పోరుపై దేశం ఏకమైంది. వైద్యులకు సంఘీభావంగా ప్రజలు ఇళ్ల బయటకు వచ్చి చప్పట్లు కొట్టాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు దేశ ప్రజలందరూ స్పందిచారు. ఇళ్ల బయటకు వచ్చి చప్పట్లు కొట్టారు.

నగరం, పట్టణం, పల్లె అనే తేడా లేకుండా ప్రతి చోటా వైద్యులకు సంఘీభావంగా ప్రజలు చప్పట్లు కొట్టారు. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్‌ జగన్‌లు తమ క్యాంపు కార్యాలయాల్లో అధికారులతో కలసి చప్పట్లు కొట్టారు.

కనిపించని శత్రువుతో కనపడే పోరాటం భారత్‌ చేస్తోందని చప్పట్లు కార్యక్రమం తెలుపుతోంది. భిన్నత్వంలో ఏకత్వం అనే భారత్‌ లక్షణం కరోనా పోరులో కనపడిందని చెప్పవచ్చు. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా దేశం మొత్తం కరోనాపై యుద్ధం కోసం ఏకమైంది. స్వాతంత్ర సంగ్రామంలో కూడా కనిపించిన విధంగా ప్రజలందరూ ఏకమయ్యారని చప్పట్లు కార్యక్రమం స్పష్టం చేస్తోంది. ఈ కార్యక్రమం ప్రజల్లో ఓకింత ధైర్యం తెచ్చిందని చెప్పవచ్చు. 

Show comments