iDreamPost
android-app
ios-app

యూవీ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయర్.. 11 బంతుల్లోనే అరుదైన ఫీట్

యూవీ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయర్.. 11 బంతుల్లోనే అరుదైన ఫీట్

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఓ అరుదైన రికార్డ్ క్రియేటైంది. భారత్ కు చెందిన ఓ యంగ్ ప్లేయర్ ఈ అరుదైన ఫీట్ అందుకున్నాడు. గత 16 ఏళ్లుగా భారత దిగ్గజ ప్లేయర్ యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఆ ప్లేయర్ మరెవరో కాదు అశుతోష్ శర్మ. ఈ ట్రోఫిలో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో అరుణాచల్ ప్రదేశ్, రైల్వేస్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లోనే యువరాజ్ సింగ్ 12 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టిన రికార్డును బ్రేక్ చేశాడు. అశుతోష్ శర్మ కేవలం 11 బంతుల్లోనే అర్ధ సెంచరీతో చెలరేగి యువరాజ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.

రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ ఓవల్ మైదానంలో రైల్వేస్, అరుణాచల్ ప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ చారిత్రాత్మక ఫీట్ చోటుచేసుకుంది. రైల్వేస్ జట్టు 245 పరుగుల భారీ స్కోరును నమోదు చేయడంతో అశుతోష్ శర్మ ఈ భారీ ఫీట్ సాధించాడు. ఉపేంద్ర యాదవ్ సెంచరీ చేసి 51 బంతుల్లో 103 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, అశుతోష్ 12 బంతుల్లో 53 పరుగులతో అందరి దృష్టిని దోచుకున్నాడు. అశుతోష్ కేవలం 11 బంతుల్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.

కాగా 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై యువరాజ్ ఈ రికార్డును నెలకొల్పాడు. 16ఏళ్ల పాటు యూవీ రికార్డ్ పదిలంగా ఉంది. 2007లో డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో యువరాజ్ 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాది అరుదైన ఫీట్ ను అందుకున్నాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో యువరాజ్ ఒక్క ఓవర్‌లో ఆరు సిక్సర్లు సాధించాడు, ఇది భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత. వాస్తవానికి యువరాజ్ గత 16 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా T20 క్రికెట్‌లో వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన క్రికెటర్ గా ప్రపంచ రికార్డును కలిగి ఉన్నాడు. అయితే 2023 ఆసియాలో నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ ఎయిరీ 9 బంతుల్లో అర్ధ సెంచరీని సాధించడంతో గత నెలలో ఈ ఫీట్ బద్దలైంది. ఇప్పుడు భారత క్రికెట్ ప్లేయర్ 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి మరోసారి యూవీ రికార్డును బ్రేక్ చేసినట్లైంది.

టీ20 క్రికెట్‌లో ప్లేయర్ల ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ:

దీపేంద్ర సింగ్ ఐరీ- 9 బంతుల్లో హాఫ్ సెంచరీ

అశుతోష్ శర్మ- 11బంతుల్లో హాఫ్ సెంచరీ

యువరాజ్ సింగ్ -12 బంతుల్లో హాఫ్ సెంచరీ

క్రిస్ గేల్- 12 బంతుల్లో హాఫ్ సెంచరీ

హజ్రతుల్లా జజాయ్ – 12 బంతుల్లో హాఫ్ సెంచరీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి