హిట్ మ్యానే తన విధ్వంసకర బ్యాటింగ్ తో అందరినీ భయపెడతాడు. అలాంటి ఈ హిట్లర్ ఫర్ ది ఫస్ట్ టైం భయపడ్డాడు. భయపడుతూ ఆడాడేమో అనిపిస్తుంది. రోహిత్ ఇలా అవుట్ అవ్వడం ఎప్పుడూ చూసి ఉండరు. స్కెచ్ వేసి మరీ రోహిత్ బలం మీద కొట్టారు.
హిట్ మ్యానే తన విధ్వంసకర బ్యాటింగ్ తో అందరినీ భయపెడతాడు. అలాంటి ఈ హిట్లర్ ఫర్ ది ఫస్ట్ టైం భయపడ్డాడు. భయపడుతూ ఆడాడేమో అనిపిస్తుంది. రోహిత్ ఇలా అవుట్ అవ్వడం ఎప్పుడూ చూసి ఉండరు. స్కెచ్ వేసి మరీ రోహిత్ బలం మీద కొట్టారు.
రోహిత్ శర్మ.. ఈ పేరు వింటే చాలు వెంటనే కొన్ని షాట్స్ గుర్తుకొస్తాయి. అందులో ముఖ్యంగా పుల్ షాట్ గురించి చెప్పుకోవాలి. ఈ షాట్ బాగా ఆడేవారిలో రికీ పాంటింగ్, కెవిన్ పీటర్సన్ లాంటి మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తాయి. కానీ రోహిత్ శర్మ ఆడినంత బాగా పుల్ షాట్‌ను ఎవరూ బాదలేరనే చెప్పాలి. అంతగా ఈ షాట్‌ను ఓన్ చేసుకున్నాడు హిట్‌మ్యాన్. రోహిత్ క్రీజులో ఉన్నప్పుడు మిడిల్ స్టంప్ లేదా లెగ్ స్టంప్ మీద బాల్ పడితే చాలు.. అది బౌండరీ లైన్‌ను దాటాల్సిందే. రోహిత్‌కు బౌన్సర్ వేస్తే బంతి సిక్సర్ అని ఫిక్స్ అయిపోవాలి.
సాధారణంగా పుల్ షాట్‌ను కొట్టాలంటే బ్యాక్ ఫుట్ మీద ఉండే ఆడాలి. కానీ రోహిత్ శర్మ మాత్రం ఫ్రంట్ ఫుట్‌పై ఉండి కూడా పుల్ షాట్ కొట్టగలడు. అయితే ఇది రోహిత్ న్యాచురల్ గేమ్‌లో భాగం కాదు. కెరీర్ మొదట్లో రోహిత్ ఈ షాట్ ఆడేవాడు కాదు. కానీ ఆ తర్వాత ఈ షాట్‌ను బాగా ప్రాక్టీస్ చేసి తన ఆయుధంగా మలచుకున్నాడు. వరల్డ్ బెస్ట్ పేసర్స్ బౌలింగ్‌లోనూ కళ్లు మూసి తెరిచేలోపు పుల్ షాట్‌తో బాల్‌ను గ్యాలరీలోకి పంపడం రోహిత్‌కు అలవాటుగా మారింది. అంతలా ఈ షాట్‌పై అతడు పట్టు సాధించాడు. మిగిలిన చాలా షాట్లు ఆడగలిగినా ఇది అతడి మెయిన్ స్ట్రెంగ్త్‌గా చెప్పుకోవాలి.
రోహిత్ బలమైన పుల్ షాట్ ఇవాళ కాస్త బలహీనంగా మారింది. వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డేలో హిట్‌మ్యాన్ బౌన్సర్లను ఎదుర్కోవడంలో కొంచెం ఇబ్బందిపడ్డాడు. మంచి పేస్‌తో రైట్ షోల్డర్‌ను టార్గెట్ చేసుకొని పేసర్ హసన్ మహమూద్ వేసిన బంతుల్ని ఎదుర్కోవడం రోహిత్ వల్ల కాలేదు. అయితే తర్వాత హసన్ బౌలింగ్‌లో ఒకట్రెండు పుల్ షాట్స్‌తో సిక్సులు కొట్టాడు హిట్‌మ్యాన్. కానీ మళ్లీ అతడి బౌలింగ్‌లోనే షార్ట్ బాల్‌ను బౌండరీకి తరలించే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఒకరకంగా రోహిత్‌ను వరుస బౌన్సర్లతో బంగ్లా బౌలర్లు భయపెట్టారు. మరి.. రోహిత్ బలమైన పుల్ షాట్ ఈ మ్యాచ్‌లో బలహీనంగా మారడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IND vs BAN: కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ! ఎందుకంటే..?
This is rare, very very rare. pic.twitter.com/I4PkwY81Hm
— CricTracker (@Cricketracker) October 19, 2023