iDreamPost
android-app
ios-app

విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్ శర్మ.. ఏ విషయంలో అంటే..?

  • Author singhj Updated - 04:04 PM, Thu - 19 October 23
  • Author singhj Updated - 04:04 PM, Thu - 19 October 23
విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్ శర్మ.. ఏ విషయంలో అంటే..?

వన్డే వరల్డ్ కప్​-2023లో టీమిండియా జోరు మామూలుగా లేదు. ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని చితక్కొడుతూ పోతోంది రోహిత్ సేన. బ్యాటింగ్​లో కెప్టెన్ రోహిత్ శర్మ ముందుండి నడిపిస్తున్నాడు. అతడికి తోడుగా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్​లు అదరగొడుతున్నారు. బౌలింగ్​లో పేస్ త్రయం జస్​ప్రీత్ బుమ్రా, మమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నారు. స్పిన్ ద్వయం రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్​ అపోజిషన్ టీమ్స్​కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఫీల్డింగ్​లో కూడా మన ప్లేయర్లు పాదరసంలా కదులుతూ విలువైన రన్స్ సేవ్ చేస్తున్నారు. ఇదే ఫామ్​ను, జోరును కొనసాగిస్తే భారత్​ను ఆపడం ఎవరి తరం కాదనే చెప్పాలి.

ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్​ను చిత్తు చేసిన టీమిండియా.. ఇప్పుడు బంగ్లాదేశ్​తో మ్యాచ్​కు రెడీ అవుతోంది. ఈ మ్యాచ్​లోనూ భారత టాపార్డర్ చెలరేగితే మరో విక్టరీ అకౌంట్​లో పడ్డట్లే. ఇదిలా ఉంటే.. ఒక విషయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కెప్టెన్ రోహిత్ శర్మ వెనక్కి నెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన వన్డే ర్యాంకింగ్స్​లో బ్యాటింగ్​లో కోహ్లీని రోహిత్ అధిగమించాడు. ప్రపంచ కప్​లో ఆడిన మూడు మ్యాచుల్లో ఒక సెంచరీ సహా ఓ హాఫ్ సెంచరీ చేసిన హిట్​మ్యాన్ ర్యాంకింగ్స్​లో దుమ్మరేపాడు. తనకంటే ముందు ఉన్న కోహ్లీ (711)ను రోహిత్ (719) వెనక్కి నెట్టాడు.

తాజా వన్డే ర్యాంకింగ్స్​లో రోహిత్ శర్మ 6వ స్థానంలో ఉండగా.. కోహ్లీ 8వ పొజిషన్​లో కంటిన్యూ అవుతున్నాడు. ఇక, ప్రపంచ కప్​లో తొలి రెండు మ్యాచులు ఆడకపోయినా శుబ్​మన్ గిల్ (818) రెండో స్థానంలో ఉండటం విశేషం. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం (836) టాప్ పొజిషన్​ను కాపాడుకున్నాడు. ఐసీసీ వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ మూడో స్థానానికి పడిపోయాడు. స్పిన్నర్ కుల్​దీప్ యాదవ్ 8వ పొజిషన్​లో కంటిన్యూ అవుతున్నాడు. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజల్​వుడ్ (660) టాప్​లో ఉన్నాడు. ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్​లో టీమిండియా నంబర్ వన్ పొజిషన్​ను నిలబెట్టుకుంది. మరి.. ర్యాంకింగ్స్​లో కోహ్లీని రోహిత్ అధిగమించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నెట్స్​లో కోహ్లీ భారీ సిక్స్! ఫీల్డర్​గా మారిన పోలీస్ అన్న!