iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో మరో విషాదం.. మహిళ ఇలా చేసిందేంటి?

హైదరాబాద్ లో మరో విషాదం.. మహిళ ఇలా చేసిందేంటి?

హైదరాబాద్ లో మరో విషాదం చోటు చేసుకుంది. శ్రీవిద్య అనే మహిళ సోమరాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఉన్నట్టుండి ఈ మహిళ సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలేం జరిగిందంటే? శ్రీవిద్య నగరంలోని బండ్లగూడ బస్ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఉద్యోగానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేవారు. అయితే ఈ క్రమంలోనే శ్రీవిద్య సోమవారం రాత్రి ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోకి వెళ్లి చూడగా శ్రీవిద్య అపస్మారకస్థితిలో కనిపించింది.

అప్రమత్తమై ఆమెను పరిశీలించగా అప్పటికే చనిపోయినట్లుగా నిర్ధారించుకున్నారు. ఉన్నట్టుండి ఈ మహిళ ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఆమె మరణంపై తోటి మహిళా ఉద్యోగులు సైతం స్పందించారు. శ్రీవిద్య మరణానికి మేనేజర్ శాలిని వేధింపులే కారణమని డిపో ఎదుట ధర్నాకు దిగారు. ఆమెకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి