iDreamPost

నెల రోజుల క్రితం భర్త మృతి.. దారుణానికి పాల్పడిన భార్య

  • Published Jan 10, 2024 | 9:12 AMUpdated Jan 10, 2024 | 9:12 AM

భర్త చనిపోయి నెల రోజులు కూడా కాలేదు.. ఈలోపు భార్య తీసుకున్న దారుణ నిర్ణయంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ వివరాలు..

భర్త చనిపోయి నెల రోజులు కూడా కాలేదు.. ఈలోపు భార్య తీసుకున్న దారుణ నిర్ణయంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ వివరాలు..

  • Published Jan 10, 2024 | 9:12 AMUpdated Jan 10, 2024 | 9:12 AM
నెల రోజుల క్రితం భర్త మృతి.. దారుణానికి పాల్పడిన భార్య

సృష్టిలో విడదీయలేని బంధం ఏదైనా ఉందంటే అది భార్యాభర్తల అనుబంధమే అంటారు. అప్పటి వరకు కనీసం ముఖ పరిచయం కూడా లేని వారు వివాహ బంధంతో ఒక్కటవుతారు.. ఆ తర్వాత.. భాగస్వామే ప్రాణంగా బతుకుతారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే.. ఆ చేయిని విడిచిపెట్టరు. అంతలా కలిసిపోతారు. ఎంత ప్రేమను పెంచుకుంటారంటే.. జీవిత భాగస్వామి మృతి చెందితే.. ఆ బాధను తట్టుకోలేక వారు సైతం ప్రాణాలు తీసుకుంటారు. దీని వల్ల పిల్లలు అనాథలు అవుతారని తెలిసినా సరే.. ఇలాంటి దారుణ నిర్ణయాలు తీసుకుంటారు కొందరు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. భర్త మృతిని తట్టుకోలేక భార్య దారుణ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

ఈ దారుణం హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. నెల రోజుల క్రితం అనారోగ్య సమస్య వల్ల భర్త మృతి చెందాడు. అతడి మరణాన్ని తట్టుకోలేక పోయిన భార్య.. డిప్రెషన్‌కు గురై ఆత్మహత్య చేసుకుంది. మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ధూల్‌పేట ఆరంఘర్‌కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రహింపురాకు చెందిన అమన్‌కుమార్‌ సింగ్, ఆరంఘర్‌ కాలనీకి చెందిన అస్మితసింగ్‌ కొన్నాళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిది అన్యోన్య దాంపత్యం. వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు కుమారులు కూడా జన్మించారు.

వీరి అన్యోన్యతను చూసి విధికి కళ్లు కుట్టాయేమో.. అనారోగ్యం రూపంలో వారి కుటుంబాన్ని విధి వెక్కిరించింది. అమన్‌కుమార్‌ సింగ్‌ గత నెల అనగా డిసెంబర్‌ 26న బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతి చెందాడు. భర్త మరణాన్ని తట్టుకోలేకపోయిన అస్మిత డిఫ్రెషన్‌కు గురైంది. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పి చూసినా భర్త మరణించాడనే విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఈక్రమంలో దారుణ నిర్ణయం తీసుకుంది. మంగళవారం మధ్యాహ్నం గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుంది అస్మిత. దీనిని గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే కిందకు దించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే అస్మిత మృతి చెందినట్లుగా అప్పటికే వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. కేను నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భార్యాభర్తలిద్దరూ మృతి చెందడంతో.. పిల్లలు అనాథలయ్యారు. అస్మిత ఇంత దారుణ నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారైనా పిల్లల గురించి ఆలోచించాల్సింది అంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి