iDreamPost
iDreamPost
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా ఉంది. అయితే రాజధానులుగా ఏర్పాటవుతున్న ప్రాంతాల్లో ప్రజలు సంబరాల్లో మునిగిపోతున్నారు. అభివృద్ధి రాజధానితో జరుగుతుందని చర్చించుకుంటున్నారు. రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో కూడా ఇప్పుడు ఇదే పరిస్తితి కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ హై కోర్టుకు వేధిక కాబోతోన్నకర్నూలులో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి.. హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేస్తుండటంతో ఇక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూనే.. ఎక్కడ హై కోర్టు వస్తుందోనని చర్చించుకుంటున్నారు. ఏ ప్రాంతంలో పెట్టునన్నారన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. కర్నూలు ఆంధ్రప్రదేశ్ మొట్ట మొదటి రాజధాని ..ఆ తరువాత రాజధాని హైదరాబాద్ కి వెళ్లిన తరువాత కర్నూల్లో అభివ్రద్ది కుంటు పడింది.. రాష్ట్ర విభజన తరువాత కూడా కర్నూల్ కి ఎలాంటి న్యాయం జరగ లేదన్నది అందరి వాదన..అందుకే కర్నూల్లో హై కోర్ట్ తో పాటు రాజధాని పెట్టాలని రాయలసీమ వాదులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ హైకోర్టు పెట్టాలనుకుంటుండటంతో హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న దానిపై ఉత్కంఠత నెలకొంది. నగరంలోని ఎపిఎస్పీ బెటాలియన్లో చాలా స్థలం ఖాలీగా ఉంది. ఈ బెటాలియన్ బళ్లారి చౌరస్తా జాతీయ రహదారిని అనుకుని కర్నూలు మార్కెట్ యార్డు వరకు దాదాపు 200 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. లోపల పోలీస్ అధికారుల బిల్డింగ్ లతో పాటు అతిధి గృహాలు, పోలీసు క్వార్టర్స్, మూడు చోట్ల విశాలంగా పెద్ద పెద్ద మైదానాలు ఉన్నాయి. బెటాలియన్ బయట కర్నూలు , బెంగుళూర్,హైదరాబాద్ బళ్లారి జాతీయ రహదారులని కలిపే జంక్షన్ పాయింట్ ఉంది. దీంతో ఇదే హైకోర్టు కి అనుకూలమని మెజార్జీ వర్గాలు భావిస్తున్నాయి.
కర్నూల్లో హై కోర్ట్ బెంచ్ ప్రస్తావన వచ్చినప్పుడే ఏపీఎస్పీ బెటాలియన్ క్యాంపుని పరిశీలించారు. బెటాలియన్ లోని పోలీసులకి నగర శివారులోని జగన్నాథ గట్టు సమీపంలో పోలీస్ శిక్షణా కేంద్రం సమీప ప్రాంతానికి మార్చాలని అక్కడ భూ సేకరణ కూడా చేశారు. ఇప్పుడు కర్నూల్లో హై కోర్టు పెట్ట డానికి రెడీగా బెటాలియన్ క్యాంపు సిద్దంగా ఉందని . ఇది అయితేనే అందిరీకీ అనుకూలంగా ఆమోదంగా ఉంటుందని పలువురు సీనియర్ న్యాయవాధులు అభిప్రయపడుతున్నారు. హై కోర్టు కి సొంత భవణాలు నిర్మించే వరకు అద్దె భవనాల్లో నిర్వహించాలనుకుంటే దానికి కర్నూలు శివారులోని ఓ ప్రయివేట్ కాలేజీని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు నుంచి బెంగుళూర్ కి వెళ్లే దారిలో చిన్నటేకూర్ సమీపంలో ఓ ప్రయివేట్ కాలేజీ బిల్డింగ్ గత కొంత కాలంగా ఖాళీగా ఉంది. ఈ బిల్డింగ్ ను లీజ్ కి తీసుకుని కొద్ది రోజులు ఇక్కడ నుంచి హై కోర్టు కార్యకలాపాలు సాగిస్తారన్న ప్రచారం సాగుతోంది.
ఏదిఏమైనా ఇన్నాళ్లు అభివృద్ధికి నోచుకోని తమ ప్రాంతం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలోనైనా ఆ తరహాలో ముందుకు వెళుతుందని ఇక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. రాయలసీమలో హైకోర్టు వస్తే తాము బాగుపడతామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటేనే ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి హైకోర్టు విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందో వేచి చూడాలి..