iDreamPost
iDreamPost
న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా రూపొందిన హిట్ నిన్న థియేటర్లలో అడుగు పెట్టింది. క్రైమ్ థ్రిల్లర్ గా ప్రమోషన్ టైంలో బాగానే హైప్ తెచ్చుకున్న ఈ మూవీకి పర్వాలేదు అనే ఓపెనింగ్ దక్కింది. విశ్వక్ సేన్ కు ప్రత్యేకంగా ఇమేజ్ అంటూ లేకపోవడం, ఈ జానర్ సినిమాలకు మాస్ దూరంగా ఉండటం లాంటి కారణాల వల్ల కేవలం 1 కోటి 15 లక్షలకే హిట్ పరిమితమయ్యింది. జరిగిన బిజినెస్ జస్ట్ 5 కోట్లే కాబట్టి ఇది ఒక రకంగా సేఫ్ గేమ్ అనే చెప్పొచ్చు. అయితే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న హిట్ కు ఈ వీకెండ్ చాలా కీలకం.
గత వారం వచ్చిన భీష్మ చాలా స్ట్రాంగ్ గా ఉండటంతో మంచి క్రౌడ్స్ ని లాగుతోంది. హిట్ తో పాటు పోటీగా వచ్చిన రెండు డబ్బింగ్ సినిమాలు కంటెంట్ తో సంబంధం లేకుండా పబ్లిసిటీ లోపం వల్ల జనం లేక హాళ్లు వెలవెలబోతున్నాయి. సో ఇప్పుడీ అవకాశాన్ని హిట్ ఏ మేరకు వాడుకుంటుందనేది కీలకంగా మారింది. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ విషయంలో హిట్ టీమ్ యాక్టివ్ గానే ఉంది.
ఇక కలెక్షన్ల సంగతి చూస్తే నైజామ్ లొనే సగం షేర్ 55 లక్షలు రాబట్టిన హిట్ మిగిలిన ఏరియాలకు కలిపి బాలన్స్ అమౌంట్ తెచ్చింది. ఇతర ప్రాంతాల్లో హిట్ పరుగులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. కృష్ణా, ఉభయ గోదావరి, సీడెడ్ లో చాలా వీక్ గా వచ్చాయి వసూళ్లు. కమర్షియల్ అంశాలకు ఇలాంటి కథల్లో చోటు లేకపోయినా నెరేషన్ స్లోగా సాగిందన్న కంప్లైంట్ అయితే హిట్ మీద ఉంది. మరి పెట్టుబడి మొత్తాన్ని హిట్ వెనక్కు ఇస్తుందా లేదా అని నిర్ణయించడంలో ఈ వారాంతం చాలా కీలకంగా మారనుంది.
– ఏరియా వారీగా మొదటి రోజు ఆంధ్ర తెలంగాణ కలెక్షన్స్
AREA | SHARE |
నైజాం | 0.55cr |
సీడెడ్ | 0.12cr |
ఉత్తరాంధ్ర | 0.10cr |
గుంటూరు | 0.15cr |
క్రిష్ణ | 0.08cr |
ఈస్ట్ గోదావరి | 0.05cr |
వెస్ట్ గోదావరి | 0.06cr |
నెల్లూరు | 0.04cr |
Total Ap/Tg | 1.15cr |