iDreamPost
iDreamPost
యశోద, మసూద తప్ప నవంబర్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా చెప్పుకోదగ్గ విశేషాలు లేవు. ఇవి కూడా భారీ వసూళ్లు తెచ్చినవి కాదు కానీ బయ్యర్ల పెట్టుబడిని సేఫ్ చేయడంతో పాటు మంచి లాభాలు ఇచ్చినవి. అందుకే ఇప్పుడు అందరి కన్ను డిసెంబర్ 2న విడుదల కాబోతున్న హిట్ 2 మీద ఉంది. మేజర్ లాంటి ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత అడవి శేష్ చేసిన మూవీ కావడంతో దీని మీద మంచి అంచనాలు ఉన్నాయి. విశ్వక్ సేన్ చేసిన హిట్ 1ని మించిన ఇంటెన్సిటీ ట్విస్టులతో ప్రేక్షకులను కట్టిపారేస్తామని టీమ్ నమ్మకంగా చెబుతోంది. ట్రైలర్ ఆల్రెడీ అంచనాలు పెంచేసింది. దర్శకుడు శైలేష్ కొలను దీన్ని మల్టీ వర్స్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
రాజమౌళి ముఖ్యఅతిధిగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత హైప్ ఇంకా పెరిగింది. నిర్మాతగా వ్యవహరిస్తున్న న్యాచురల్ స్టార్ నాని ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. సైకో థ్రిల్లర్ కథే అయినప్పటికీ కథా కథనాలు ఊహించని విధంగా సాగుతాయని చెబుతున్నారు. క్లైమాక్స్ ట్విస్టుతో పాటు అక్కడిదాకా దారి తీసే పరిణామాలను ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో రాసుకున్నారట. 15 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేయడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పదహారు కోట్లకు ఫిక్స్ అయ్యింది. సూపర్ హిట్ టాక్ వస్తే ఈ మొత్తం ఈజీనే. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ కాకపోయినా రాక్షసుడు తరహాలో మెప్పిస్తే సులభంగా మరో బ్లాక్ బస్టర్ కొట్టొచ్చు.
హిట్ 2కి కలిసొస్తున్న మరో అంశం ఆపై వారం డిసెంబర్ 9న చెప్పుకోదగ్గ రిలీజులు ఏవీ లేకపోవడం. పంచతంత్రం లాంటివి ఉన్నాయి కానీ వేటికీ స్టార్ క్యాస్టింగ్ లేదు. తిరిగి 16న అవతార్ 2 వచ్చే దాకా రన్ దక్కుతుంది. ఆ రోజు నుంచి స్క్రీన్లు ఎలాగూ తగ్గిపోతాయి. అంటే రెండు వారాల సమయం అడవి శేష్ బృందానికి ఉంటుంది. ఆలోగా వీలైనంత ఎక్కువ రాబట్టుకోవాల్సి ఉంటుంది. హిట్ 3లో నాని, విజయ్ సేతుపతిలు ఉంటారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ కొనసాగింపు హిట్ 2 ఎంత పెద్ద సక్సెస్ అవుతుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాంపిటీషన్ లేకుండా బరిలో దిగుతున్న క్రైమ్ థ్రిల్లర్ కు జాన్ స్టీవర్ట్ ఏడూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు