iDreamPost
android-app
ios-app

CM జగన్‌కి నాగార్జున, మహేష్ బాబు బర్త్ డే విషెస్!

  • Published Dec 21, 2023 | 4:44 PM Updated Updated Dec 21, 2023 | 4:44 PM

YS Jagan Birthday: గురువారం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులు సీఎం జగన్ కి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రత్యేకంగా విషెస్ తెలుపుతున్నారు.

YS Jagan Birthday: గురువారం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులు సీఎం జగన్ కి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రత్యేకంగా విషెస్ తెలుపుతున్నారు.

  • Published Dec 21, 2023 | 4:44 PMUpdated Dec 21, 2023 | 4:44 PM
CM జగన్‌కి నాగార్జున, మహేష్ బాబు బర్త్ డే విషెస్!

గురువారం(డిసెంబర్ 21)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్ సీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రక్తదానాలు, అన్నదానాలు చేస్తూ.. జగన్ పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల కేకులు కట్ చేసి.. స్వీట్లు పంచుకుంటూ సీఎం జగన్ బర్త్ డే వేడుకలను జరుపుకున్నారు. అలానే ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన బర్త్ డే విషెస్ లు వెల్లువెత్తాయి.

తాజాగా  సీఎం జగన్ కి టాలీవుడ్ హీరో, కింగ్  అక్కినేన నాగార్జున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన కోరారు. ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని నాగార్జున ఆకాంక్షించారు.  ఇక గన్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ తన ఎక్స్ పేజీలో నాగార్జున పోస్ట్ చేశారు.  అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం సీఎం జగన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు  మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పారు. ‘ఈ ఏడాది మీరు మరిన్ని విజయాలు సాధించాలని, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో  ఉండాలి’ అని కోరుకుంటున్నట్లు ట్వీట్ లో రాసుకోచ్చారు. ఇప్పటికే  ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్ కూడా సీఎం జగన్ కి బర్త్ డే విషెస్ చెప్పారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా  సీఎం జగన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని పలువురు ప్రముఖులు ఫోన్ల ద్వారా సీఎం జగన్ కి విషెస్ తెలియజేశారు. అలానే నేడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టాయి. ఇక సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ సినీ ప్రముఖలు, అభిమానులు ఆయనకు ప్రత్యక్షంగా, సోషల్ మీడియాలో విషెస్ తెలుపుతున్నారు. 1972 డిసెంబర్ 21 సీఎం జగన్ జన్మించారు. నేడు 51వ పుట్టిన రోజును ఆయన జరుపుకుంటున్నారు. మరి.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మీరు బర్త్ డే విషెస్ ను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş